Begin typing your search above and press return to search.

ప్లీజ్ రౌడీ.. తమ్ముడిలా ట్రై చేయొచ్చుగా!!

By:  Tupaki Desk   |   14 July 2021 5:30 PM GMT
ప్లీజ్ రౌడీ.. తమ్ముడిలా ట్రై చేయొచ్చుగా!!
X
విజయ్ దేవరకొండ హీరోగా ప్రస్తుతం లైగర్‌ సినిమా రూపొందుతున్న విషయం తెల్సిందే. పూరి జగన్నాద్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఆ సినిమా ప్రారంభం అయ్యి దాదాపుగా రెండేళ్లు కావస్తుంది. కరోనా కారణంగా షూటింగ్‌ ముందుకు సాగడం లేదు. కరోనా సెకండ్‌ వేవ్ కారణంగా నిలిచి పోయిన షూటింగ్‌ ను పునః ప్రారంభించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరో వైపు జూనియర్ రౌడీ స్టార్‌ ఆనంద్ దేవరకొండ మాత్రం దూసుకు పోతున్నాడు. మొదటి సినిమా దొరసాని తర్వాత కాస్త గ్యాప్‌ ఇచ్చినా ఆ తర్వాత మాత్రం గ్యాప్‌ రాకుండా జాగ్రత్త పడుతున్నాడు.

ఆనంద్ దేవరకొండ రెండవ సినిమా మిడిల్ క్లాస్ మెలోడీస్ ను డైరెక్ట్‌ ఓటీటీ ద్వారా విడుదల చేశారు. ఆ సినిమా తో కాస్త పాజిటివ్ టాక్‌ ను జూనియర్‌ దేవరకొండ దక్కించుకున్నాడు. ఆ సినిమా తర్వాత వెంటనే పుష్పక విమానం సినిమాను ఆనంద్‌ దేవరకొండ చేస్తున్నట్లుగా ప్రకటన వచ్చింది. వెంటనే సినిమా షూటింగ్‌ కూడా ప్రారంభించారు.. సినిమా షూటింగ్‌ ను ముగించినట్లుగా ఇటీవలే యూనిట్‌ సభ్యులు తెలియజేశారు. పుష్పక విమానంను థియేటర్ రిలీజ్ కు ప్లాన్‌ చేస్తున్నారు. పుష్పక విమానంను ముగించిన ఆనంద్‌ నాల్గవ సినిమాను ఇప్పటికే ప్రకటించాడు.

ప్రముఖ టెక్నీషియన్‌ అయిన కేవీ గుహన్‌ దర్శకత్వంలో ఆనంద్‌ దేవరకొండ హీరోగా సినిమా రూపొందబోతుంది. ఇటీవలే సినిమాను ప్రకటించిన మేకర్స్‌ వెంటనే షూటింగ్‌ ను మొదలు కూడా పెట్టేశారు. నేడు సింపుల్‌ గా షూటింగ్ కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సినిమాకు హైవే అనే టైటిల్ ను అనుకుంటున్నారు. ప్రముఖ టెక్నీషియన్స్‌ ఈ సినిమాకు వర్క్‌ చేస్తున్నారని తప్పకుండా ఇదో మంచి సినిమాగా నిలుస్తుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు సైతం వ్యక్తం చేస్తున్నారు. వరుసగా ఆనంద్‌ సినిమా వెంట సినిమా చేస్తుంటే విజయ్ కాస్త స్లో గా ఉండటం అభిమానులు కాస్త జీర్ణించుకోలేక పోతున్నారు. విజయ్ దేవరకొండ బ్యాక్‌ టు బ్యాక్ సినిమాలు చేయాలని వారు ఆశిస్తున్నారు.