Begin typing your search above and press return to search.

ఫస్ట్ లుక్: ఆనంద్ దేవరకొండ దొరసాని

By:  Tupaki Desk   |   31 March 2019 3:07 PM GMT
ఫస్ట్ లుక్: ఆనంద్ దేవరకొండ దొరసాని
X
టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మిక హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న చిత్రం 'దొరసాని'. సురేష్ బాబు.. యాష్ రంగినేని.. మధుర శ్రీధర్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు కేవీఆర్ మహేంద్ర.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. నిర్మాతలు సోషల్ మీడియా ద్వారా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తూ "షూటింగ్ సమయంలో అద్భుతమైన క్షణాలెన్నో అనుభవించాం.. ఇప్పుడు #దొరసాని తో మీముందుకు రాబోతున్నాం. నిజ జీవితాల నుండి ప్రేరణతో..!" అంటూ ట్వీట్ చేశారు. సినిమా పోస్టర్ లో టైటిల్ లోగో ఆసక్తికరంగా ఉంది. హీరో హీరోయిన్లను ఇతర పాత్రలను మాత్రం చూపలేదు.

గాలిలో ఎగురుతున్నట్టుగా ఉన్న చున్నీ.. ఎర్రమట్టి రంగులో ఉన్న టైటిల్ లోగో ఉంది. టైటిల్ కింద ఒక నీడలా పల్లెటూరిని ప్రతిబింబించే వాతావరణం ఉంది. రెండు సైకిల్స్.. ఇద్దరు వ్యక్తులు.. ఒక జెండా తో ముందుకు నడుస్తున్న మనిషి వెనకాలే ఆయనను ఫాలో అవుతున్న ముగ్గురు వ్యక్తులు.. ఇదంతా చూస్తుంటే ఒక పీరియడ్ బ్యాక్ ను సూచిస్తోంది. ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా.!