Begin typing your search above and press return to search.

రిలీజ్ కి రెడీ అవుతున్న దేవ‌రకొండ బ్రదర్ మూడో సినిమా..?

By:  Tupaki Desk   |   23 Dec 2020 1:30 AM GMT
రిలీజ్ కి రెడీ అవుతున్న దేవ‌రకొండ బ్రదర్ మూడో సినిమా..?
X
టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ 'దొరసాని' సినిమాతో హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ అవకపోవడంతో కాస్త గ్యాప్ తీసుకుని 'మిడిల్ క్లాస్ మెలోడీస్' సినిమాతో వచ్చాడు ఆనంద్. వినోద్ అనంతోజు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇటీవలే అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా డైరెక్ట్ ఓటీటీ పద్ధతిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. స్ట్రీమింగ్ అయిన మొదటి ఆట నుంచే ఈ మూవీ ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే 'మిడిల్ క్లాస్ మెలోడీస్' ఇచ్చిన జోష్ లో ఇప్పుడు దేవరకొండ బ్రదర్ సైలెంటుగా మూడో సినిమాని కూడా పూర్తి చేస్తున్నాడట.

విజయ్ దేవరకొండ తన స్వంత నిర్మాణ సంస్థ 'కింగ్‌ ఆప్ ది హిల్స్ ఎంటర్టైన్మెంట్స్' బ్యానర్ లో ఆనంద్ దేవ‌రకొండ మూడో చిత్రాన్ని రూపొందిస్తున్నాడని సమాచారం. ఇది రాయలసీమ నేపథ్యంలో జరిగే స్టోరీ అని టాక్. ఈ చిత్రానికి సంబంధించిన వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారని అంటున్నారు. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు వచ్చిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో థియేట్రికల్ రిలీజ్ చేయాలని చూస్తున్నారట. 'మిడిల్ క్లాస్ మెలోడీస్' నుంచి వ‌చ్చిన స‌క్సెస్ ను ఉప‌యోగించుకోవ‌డానికి ఆనంద్ ట్రై చేస్తున్నాడు. ఆనంద్ ని ఎలాగైనా హీరోగా నిల‌బెట్టాల‌ని పెట్టుబ‌డి పెడుతున్న విజయ్ దేవరకొండ తమ్మడుకి మరో హిట్ అందిస్తాడేమో చూడాలి.