Begin typing your search above and press return to search.

మూడు కొత్త సినిమాలను ప్రకటించిన ఆనంద్ దేవరకొండ

By:  Tupaki Desk   |   15 March 2021 11:50 AM GMT
మూడు కొత్త సినిమాలను ప్రకటించిన ఆనంద్ దేవరకొండ
X
టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ 'దొరసాని' సినిమాతో హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే. 'మిడిల్ క్లాస్ మెలోడీస్' సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న ఆనంద్.. ప్రస్తుతం 'పుష్పక విమానం' అనే కామెడీ ఎంటర్టైనర్ ని రిలీజ్ కి రెడీ చేస్తున్నాడు. 'మిడిల్ క్లాస్..' వంటి కమర్షియల్ సక్సెస్ తో క్రేజీ ఆఫర్స్ అందుకుంటున్న ఆనంద్ దేవరకొండ.. నేడు తన పుట్టినరోజు సందర్భంగా మూడు కొత్త ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేశారు.

మధురా శ్రీధర్ రెడ్డి నిర్మాణంలో ఆనంద్ దేవరకొండ ఓ సినిమా చేయనున్నారు. బలరాం వర్మ నంబూరి మరియు బాల సోమినేని ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామ్యులుగా వ్యవహరిస్తున్నారు. మధురా ఎంటర్టైన్మెంట్స్ - రోల్ కెమెరా విజువల్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి దర్శకుడు మరియు ఇతర నటీనటులు సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో ప్రకటించనున్నారు. ఇదే క్రమంలో హై లైఫ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెం.1గా రూపొందనున్న చిత్రంలో ఆనంద్ నటించనున్నాడు. డెబ్యూ డైరెక్టర్ ఉదయ్ శెట్టి తెరకెక్కించనున్న ఈ చిత్రాన్ని కేదార్ సెలగం శెట్టి - వంశీ కారుమంచి కలిసి నిర్మించనున్నారు. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాకు సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులను ప్రకటించనున్నారు.

అలానే టాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ హౌసెస్ లో ఒకటైన సురేష్ ప్రొడక్షన్స్ సంస్థలో ఆనంద్ దేవరకొండ ఓ సినిమా చేయబోతున్నారని సమాచారం. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాకపోయినా సినిమా మాత్రం కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. సురేష్ ప్రొడక్షన్స్ మరియు గురు ఫిలింస్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమాతో కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కానున్నాడు. ఇలా పుట్టినరోజున సందర్భంగా ఆనంద్ తను చేయబోయే 3 సినిమాలను ప్రకటించి దూకుడు పెంచాడని చెప్పవచ్చు.