Begin typing your search above and press return to search.

'మిడిల్ క్లాస్ మెలోడీస్' అంటున్న దేవరకొండ...!

By:  Tupaki Desk   |   10 July 2020 1:00 PM GMT
మిడిల్ క్లాస్ మెలోడీస్ అంటున్న దేవరకొండ...!
X
టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటూనే తన తమ్ముడు ఆనంద్ దేవరకొండని కూడా హీరోగా ఇంట్రడ్యూస్ చేసిన సంగతి తెలిసిందే. మహేంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన 'దొరసాని' సినిమాతో హీరో రాజశేఖర్ కూతురు శివాత్మికతో పాటు ఆనంద్ దేవరకొండ పరిచయమయ్యాడు. గతేడాది విడుదలైన ఈ పీరియాడిక్ లవ్ డ్రామా 'దొరసాని' మూవీ రిజల్ట్ నిరాశపరిచినా ఆనంద్ దేవరకొండ నటనకు మంచి పేరే వచ్చింది. అప్పటి నుంచి ఆచితూచి స్టోరీలను సెలెక్ట్ చేసుకోవాలని డిసైడ్ అయిన ఆనంద్ దేవరకొండ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసాడు.

టాలీవుడ్ లో 'లౌక్యం' 'శమంతకమణి' 'పైసా వసూల్' వంటి హిట్ చిత్రాలు నిర్మించిన ప్రముఖ నిర్మాత ఆనంద్ ప్రసాద్ ఆనంద్ దేవరకొండతో సినిమా నిర్మిస్తున్నారు. భవ్య క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందనున్న ఈ సినిమాకి 'మిడిల్ క్లాస్ మెలోడీస్' అనే టైటిల్ ఖరారు చేసినట్లు అధికారిక ప్రకటన వెలువడింది. ఈ చిత్రం ద్వారా వినోద్ అనంతోజు అనే ఓ కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ఇక 'బిగిల్' 'చూసి చూడంగానే' 'జాను' సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వర్ష బొల్లమ్మ ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తుంది. 'కేరాఫ్ కంచరపాలెం' చిత్రానికి సంగీతం అందించిన టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ స్వీకర్ అగస్తీ 'మిడిల్ క్లాస్ మెలోడీస్' మూవీకి సంగీతం అందిచనున్నారు. ఈ ప్రాజెక్ట్ కి సంభందించిన ఇతర వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.