Begin typing your search above and press return to search.

ఆదిపురుష్ కి అనుకోని సమస్య.. పెద్ద చిక్కొచ్చి పడ్డదే..!

By:  Tupaki Desk   |   25 Oct 2022 5:44 AM GMT
ఆదిపురుష్ కి అనుకోని సమస్య.. పెద్ద చిక్కొచ్చి పడ్డదే..!
X
ప్రభాస్ కెరియర్ లో మొదటిసారి స్ట్రైట్ గా బాలీవుడ్ లో చేస్తున్న సినిమా ఆదిపురుష్. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రామాయణ కథతో వస్తుంది. సినిమాలో రాముడిగా ప్రభాస్ రావణాసురుడు పాత్రలో సైఫ్ అలి ఖాన్ నటిస్తున్నారు. కృతి సనన్ సీత పాత్రలో కనిపించనుంది.

టీ సీరీస్ నిర్మిస్తున్న ఈ సినిమాని 2023 జనవరి 12న రిలీజ్ ఫిక్స్ చేశారు. ఈ రిలీజ్ పై సౌత్ డిస్ట్రిబ్యూటర్స్ టెన్షన్ లో ఉన్నారు. ప్రభాస్ సినిమా బిజినెస్ విషయంలో ఆలోచించాల్సిన అవసరం లేదు కానీ సంక్రాంతికి తెలుగులో పెద్ద సినిమాలు వస్తున్నాయి. అందుకే సౌత్ డిస్ట్రిబ్యూటర్స్ సినిమాను ప్రీ పోన్ కానీ, పోస్ట్ పోన్ కానీ చేయించాలని ప్రయత్నిస్తున్నారు.

ఆదిపురుష్ సినిమాని జనవరి 6న గానీ.. 26న గానీ రిలీజ్ చేసేలా చర్చలు చేస్తున్నారు. సంక్రాంతికి వారం ముందు అంటే జనవరి ఫస్ట్ వీక్ అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆ టైం లో రిలీజ్ చేస్తే సినిమాకు మంచి వసూళ్లు రాబట్టే ఛాన్స్ ఉంటుంది.

ఇక అది కుదరదు అనుకున్నప్పుడు జనవరి 26న రిలీజ్ చేయాల్సి ఉంటుంది. రిపబ్లిక్ డే నాడు షారుఖ్ ఖాన్ పఠాన్ రిలీజ్ ఫిక్స్ చేశారు. అందుకే బాలీవుడ్ నిర్మాతలు మాత్రం సంక్రాంతికే ఆదిపురుష్ రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. సంక్రాంతి బరిలో చిరు వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీర సింహా రెడ్డి, వారసుడు సినిమాలు వస్తున్నాయి.

తెలుగులో వారసుడు ప్రభావం ఎంత ఉంటుందో చెప్పలేం కానీ ఆదిపురుష్ తమిళంలో కూడా రిలీజ్ అవుతున్న కారణంగా అక్కడ విజయ్ కి పోటీ అన్న ఉద్దేశంతో సంక్రాంతికి వాయిదా వేయాలని అనుకుంటున్నారు.

మరి సౌత్ డిస్ట్రిబ్యూటర్ల విన్నపాన్ని ఆదిపురుష్ మేకర్స్ పట్టించుకుంటారా లేదా అన్నది త్వరలో తెలుస్తుంది. ఇటీవల రిలీజైన ఆదిపురుష్ టీజర్ పై మిశ్రమ స్పందన వచ్చింది. ఇలాంటి టైం లో పెద్ద సినిమాలకు పోటీ వచ్చి రిస్క్ ఎందుకని డిస్ట్రిబ్యూటర్ల ఆలోచన. మరి ఆదిపురుష్ అనుకున్నట్టుగానే సంక్రాంతికి వస్తాడా లేదా అన్నది త్వరలో తెలుస్తుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.