Begin typing your search above and press return to search.

అందాల నటికి ఖరీదైన ఫ్లాట్ గిఫ్టిచ్చాడ‌ట‌

By:  Tupaki Desk   |   6 Jan 2021 5:30 PM GMT
అందాల నటికి ఖరీదైన ఫ్లాట్ గిఫ్టిచ్చాడ‌ట‌
X
హీరో హీరోయిన్ ఎఫైర్ గురించి లేదా హీరోయిన్ తో ద‌ర్శ‌కుడి ఎఫైర్ గురించి విన్నాం. కానీ ఇది డిఫ‌రెంట్. ఒక అందాల యువ‌న‌టితో రైట‌ర్ ల‌వ్ స్టోరి కొన‌సాగ‌డం హాట్ టాపిక్ గా మారింది. స‌ద‌రు ర‌చ‌యిత ఎవ‌రు? అన్న‌ది అటుంచితే అత‌గాడు ప‌రిశ్ర‌మ‌లో బిజీ ర‌చ‌యిత. దానికి త‌గ్గ‌ట్టే ఆర్జ‌న బావుంది.

ఇటీవ‌ల‌ అత‌డు ఓ స్ట్ర‌గ్లింగ్ అప్ కం న‌టికి బాగా క్లోజ్ అయిపోయాడ‌ట‌. అప్ కం స్టార్ల‌కు ఎప్పుడూ ఆర్థిక క‌ష్టాలుంటాయి. అలా సాయం పేరుతో ఆ యువ‌న‌టితో త‌క్కువ స‌మ‌యంలోనే క‌నెక్ట‌యిపోవ‌డంతో ఆ త‌ర్వాత ప్రేమ వ్య‌వ‌హారం జోరెక్కింద‌‌న్న గుస‌గుస‌లు వేడెక్కిస్తున్నాయి. అది ప్రేమా కాదా? అన్న‌ది కూడా అటుంచితే.. స‌ద‌రు యువ‌ర‌చ‌యితకు గురువుగారైన మ‌రో బిజీ స్టార్ రైట‌ర్ వేరొక టాప్ హీరోయిన్ తో ఎఫైర్ సాగించార‌న్న ప్ర‌చారం ఉంది. దీనిని బ‌ట్టి స‌ద‌రు యువ‌ర‌చ‌యిత ఈ సీనియ‌ర్ నే ఫాలో చేస్తున్నారా? అంటూ ఒక‌టే గుస‌గుసా వినిపిస్తోంది.

అయినా ఇలా క్రియేటివిటీ రైటింగులో చూపించ‌కుండా అప్ కం న‌టీమ‌ణుల‌పై లవ్వాయ‌ణంలో క్రియేటివిటీ చూపించ‌డం త‌గునా? ఇలా అయితే ఎఫైర్ స్టార్ల జాబితాలో రైట‌ర్లు వ‌చ్చి చేరడం బావుండ‌దేమో అంటూ కొంద‌రు ఇదైపోతున్నారు మ‌రి.

అన్న‌ట్టు ఇలా ప్ర‌శ్నిస్తే రైట‌ర్ల మ‌నోభావాలు దెబ్బ తిన‌వా? అన్న చ‌ర్చా మొద‌లైంది మ‌రి. ఆస‌క్తిక‌ర ప‌రిణామం ఏమంటే ఇటీవ‌ల రైట‌ర్లు కూడా గ్లామ‌ర‌స్ స్టార్ల‌కు ధీటుగా రెడీ అయ్యి బ‌రిలో దిగిపోతుండ‌డ‌మే ఆస‌క్తిక‌ర ప‌రిణామం.