Begin typing your search above and press return to search.

కింగ్ నాగ్ దుబాయ్ మిషన్ పూర్తయ్యింది..!

By:  Tupaki Desk   |   30 March 2022 1:30 PM GMT
కింగ్ నాగ్ దుబాయ్ మిషన్ పూర్తయ్యింది..!
X
టాలీవుడ్ సీనియర్ హీరోల్లో ఒకరైన కింగ్ అక్కినేని నాగార్జున.. ప్రస్తుతం ''ఘోస్ట్'' అనే హై ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్ లో నటిస్తున్నారు. ఇందులో నాగ్ సరసన సోనాలి చౌహన్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. గత కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ దుబాయ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే.

అయితే తాజాగా 'ఘోస్ట్' దుబాయ్ షెడ్యూల్ పూర్తైనట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ కీలకమైన షెడ్యూల్ లో కొన్ని హై ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలు మరియు ఒక మెస్మరైజింగ్ సాంగ్‌ ను చిత్రీకరించినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా నాగ్ - సోనాల్ చౌహన్ కు సంబంధించిన ఓ పోస్టర్ ని రిలీజ్ చేశారు.

దుబాయ్ లోని ఎడారి ప్రాంతాల్లో షూట్ చేసిన యాక్షన్ సీన్స్ లో నాగ్ డూప్ లేకుండా బైక్ ఛేజింగ్ లో పాల్గొన్నారని తెలుస్తోంది. అలానే నాగార్జున - సోనాల్ మధ్య ఓ బ్యూటీఫుల్ పాటను చిత్రీకరించారు. ఆరు పదులు దాటిన వయసులోనూ కుర్ర హీరోల కంటే రెట్టింపు ఉత్సాహంతో షూటింగ్స్ పూర్తి చేస్తున్నారు నాగ్.

'ఘోస్ట్' సినిమాలో నాగార్జున ఇంటర్ పోల్ ఆఫీసర్ గా.. యాక్షన్ ప్యాక్డ్ రోల్ లో కనిపించబోతున్నారు. ఇందులో గుల్ పనాంగ్ - అనైకా సురేంద్రన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.

సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రై.లి బ్యానర్స్ పై నారాయణ్ దాస్ కె నారంగ్ - పుష్కర్ రామ్మోహనరావు - శరత్ మరార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

జి. ముఖేష్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. రాబిన్ సుబ్బు మరియు నభా మాస్టర్ యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. సంక్రాంతికి తనయుడు నాగచైతన్యతో కలిసి 'బంగార్రాజు' వంటి బ్లాక్ బస్టర్ అందుకున్న నాగార్జున.. ''ఘోస్ట్'' సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.