Begin typing your search above and press return to search.

విశాల్ సినిమా సెట్ లో ఏం జ‌రిగింది?

By:  Tupaki Desk   |   22 Feb 2023 5:19 PM GMT
విశాల్ సినిమా సెట్ లో ఏం జ‌రిగింది?
X
త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో యాక్ష‌న్ హీరోగా పేరు తెచ్చుకున్న విశాల్ గ‌త కొంత కాలంగా త‌న‌దైన మార్కు యాక్ష‌న్ బ్లాక్ బ‌స్ట‌ర్ తో మ‌ళ్లీ బౌన్స్ బ్యాక్ కావాల‌ని విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. ఇందు కోసం కొత్త త‌ర‌హా యాక్ష‌న్ డ్రామాల‌ని తెర‌పైకి తీసుకొస్తున్నా అవి ప్రేక్ష‌కుల్ని పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోతున్నాయి. రీసెంట్ గా `లాఠీ` మూవీతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన విశాల్ ఈ సినిమా షూటింగ్ స‌మ‌యంలో ప‌లు సార్లు గాయాల పాల‌య్యాడు.

సిన్సియ‌ర్ పోలీస్ కానిస్టేబుల్ గా న‌టించి మంచి ఇంపాక్ట్ ని క్రియేట్ చేయ‌డ‌మే కాకుండా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ని ద‌క్కించుకోవాల‌నుకున్నాడు. అయితే విశాల్ ఆశించిన స్థాయిలో `లాఠీ` త‌మిళ‌, తెలుగు ప్రేక్ష‌కుల్ని పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక బాక్సాఫీస్ వ‌ద్ద చేతులెత్తేసింది. దీంతో విశాల్ త‌న దృష్టిని `మార్క్ ఆంటోనీ` వైపు మ‌ళ్లించాడు. విశాల్ న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ `మార్క్ ఆంటోనీ`. అధిక్ ర‌విచంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

ఎస్‌.జె. సూర్య‌, సునీల్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్ర‌స్తుతం చెన్నైలో శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఇటీవ‌ల విడుద‌ల చేసిన ఫ‌స్ట్ లుక్ తో విశాల్ షాకిచ్చాడు. ఫుల్ గ‌డ్డం, మీసంతో ఖాకీ క‌ల‌ర్ డ్రెస్ లో గ‌న్ ప‌ట్టుకుని భీక‌రంగా అరుస్తూ క‌నిపించిన విశాల్ లుక్ అంద‌రిని షాక్ కు గురి చేసింది. మునుపెన్న‌డూ క‌నిపించ‌ని భిన్న‌మైన మేకోవ‌ర్ తో విశాల్ న‌టిస్తున్న సినిమా ఇది. భారీ యాక్ష‌న్ నేప‌త్యంలో సాగే పీరియాడిక్ ఫిల్మ్ గా ఈ మూవీని తెర‌కెక్కిస్తున్నారు.

ఈ మూవీ షూటింగ్ లోకేష‌న్ లో ప్ర‌మాదం జ‌రిగ‌డం విశాల్ అభిమానుల్ని క‌ల‌వ‌రానికి గురిచేస్తోంది. సెట్ లో ప్ర‌మాదం కు సంబంధించిన ఓ వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ గా మారి ట్రెండ్ అవుతోంది. ఈ మూవీ కోసం విశాల్ తో పాటు ప‌దుల సంఖ్య‌లో విల‌న్ బ్యాచ్ పాల్గొన‌గా కీల‌క ఘ‌ట్టాల‌కు సంబంధించిన యాక్ష‌న్ స‌న్నివేశాల‌ని చిత్రీక‌రిస్తున్నారు. షూటింగ్ జ‌రుగుతుండ‌గానే అక్క‌డున్న వారి పైకి ఓ వెహికిల్ గోడ‌ల్ని బ‌ద్ద‌లు కొట్టుకుని రావ‌డంతో అక్క‌డున్న వారంతా ఒక్క‌సారిగా చెల్ల‌చెదుర‌య్యారు.

అదుపు త‌ప్పిన వ్యాన్ అక్క‌డున్న వారి పైపు దూసుకురావ‌డంతో ఉన్న ప‌లంగా అక్క‌డున్న వారంతా ప్ర‌మాదాన్ని ప‌సిగ‌ట్టి త‌ప్పించుకున్నారు. దీంతో `మార్క్ ఆంటోని` సెట్ లో పెద్ద ప్ర‌మాదం త‌ప్పింది. టెక్నిక‌ల్ గా జ‌రిగిన త‌ప్పిదం వ‌ల్లే ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్టుగా తెలుస్తోంది. ఈ ఘ‌ట‌న‌లో యూనిట్ స‌భ్యుల‌కు ఎలాంటి ప్ర‌మాదం జ‌రగ‌లేదు. దీంతో చిత్ర బృందం ఊపిరి పీల్చుకుంద‌ట‌. సెట్ లో ప్ర‌మాదానికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ గా మారింది.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.