Begin typing your search above and press return to search.

జాకీచాన్ కోసం కుంగ్ ఫూ నేర్చుకుంటోంది

By:  Tupaki Desk   |   24 Dec 2015 9:30 AM GMT
జాకీచాన్ కోసం కుంగ్ ఫూ నేర్చుకుంటోంది
X
హాలీవుడ్ యాక్ష‌న్ కింగ్ జాకీచాన్‌ కి ప్ర‌పంచ వ్యాప్తంగా వీరాభిమానులున్నారు. అలాంటి స్టార్ స‌ర‌స‌న కొన్ని సీన్ల‌లో న‌టించే అవ‌కాశం వ‌చ్చినా అది అదృష్ట‌మే. అయితే అలాంటి అదృష్టం అమైరా ద‌స్త‌ర్ ఇంటి త‌లుపు త‌ట్టింది. ఓ కాస్టింగ్ ఏజెంట్ పుణ్య‌మా అని ఈ అమ్మ‌డిని జాకీచాన్ త‌న సినిమా కోసం ఎంపిక చేసుకున్నాడు. ప్ర‌స్తుతం అత‌డు న‌టిస్తున్న కుంగ్ ఫూ యోగా చిత్రంలో అమైరాకి ఓ అదిరిపోయే చాన్స్ వ‌చ్చింది. ఈ ఛాన్స్ రావ‌డ‌మే ఆల‌స్యం ఎగిరి గంతేసింది అమ్మ‌డు.

ఇప్ప‌టికే ప‌దిరోజుల పాటు త‌న‌పై చిత్రీక‌ర‌ణ కూడా పూర్తి చేశారు. అయితే ఇంత‌వ‌ర‌కూ జాకీతో క‌లిసి న‌టించే స‌న్నివేశాలేవీ తెర‌కెక్కించ‌లేదు. అదుకే ఎంతో ఎగ్జ‌యిటింగ్‌ గా వేచి చూస్తోంది అమ్మ‌డు. సాధ్య‌మైనంత తొంద‌ర్లోనే జాకీని క‌లుసుకునే అవ‌కాశం ఉంది. అదే సంగ‌తిని అమైరా చెబుతూ.. అవును నా ఫేవ‌రెట్ స్టార్ జాకీచాన్‌. అత‌డి సినిమాలో న‌టించే అవ‌కాశం రావ‌డమే నా అదృష్టం. త్వ‌ర‌లోనే నా ఫేవ‌రెట్‌ ని క‌లుసుకోబోతున్నందుకు చాలా ఎగ్జ‌యిటింగ్‌ గా ఉంది. జాకీని బోలెడ‌న్ని ప్ర‌శ్న‌లు అడిగేయాల‌నుకుంటున్నా. అంతేనా మా ఇంటికి డిన్న‌ర్‌ కి పిలిచి త‌న‌కి ఎంతో ఇష్ట‌మైన పార్సీ ఫుడ్స్ బాగా తినిపిస్తా.. అంటూ చెప్పుకొచ్చింది.

త్వ‌ర‌లోనే జాకీచాన్ - అమైరా ద‌స్త‌ర్ కాంబినేష‌న్‌ లోని స‌న్నివేశాల్ని చైనా క్యాపిట‌ల్ బీజింగ్‌ లో తెర‌కెక్కించ‌నున్నారు. అక్క‌డికి అమ్మ‌డు ప‌య‌న‌మ‌వుతోంది. ఇందులో యాక్ష‌న్ రాణీగా అద‌ర‌గొట్టేయ‌బోతోంది. అందుకోసం అమైరా కూడా కుంగ్ ఫూ నేర్చుకుంటోంది. భార‌తీయ‌త‌కు, సాంప్ర‌దాయాల‌కు సంబంధించిన కొన్ని కీల‌క‌మైన ఎపిసోడ్స్‌ ని అమైరాపై చిత్రీక‌రించ‌నున్నారు. ఇదే చిత్రంలో బాలీవుడ్ న‌టుడు సోనూసూద్ ఓ కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.