Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: ఈ పిల్ల తక్కువదేం కాదు

By:  Tupaki Desk   |   19 Feb 2016 7:30 AM GMT
ఫోటో స్టోరి: ఈ పిల్ల తక్కువదేం కాదు
X
అప్పట్లో రామ్‌ చరణ్‌ సరసన తని ఒరువన్‌ రీమేక్‌ లో నటిస్తుందని ఈ పిల్ల గురించి తెగ పబ్లిసిటీ జరిగింది. కాని చివరకు అమ్మడు ఆ పాత్రను దక్కించుకోలేక పోయింది. ఆ తరువాత పూరి జగన్‌ తీస్తున్న రోగ్‌ లోనూ ఈ భామే హీరోయిన్‌ అన్నారు. కాని అది తూచ్చే. ఇప్పుడేమో ఏకంగా జాకీ చాన్ సినిమాలో ఒక ముఖ్య పాత్రను చేస్తోందీ సుందరి.

ఆమె పేరు ఎమైరా దస్తూర్‌. అమ్మడు అప్పట్లో ధనుష్‌ సరసన అనిగెన్‌ (తెలుగులో అనేకుడు) సినిమాలో నటించింది. ఈ భామకు ఇక్కడ కావల్సినంత బ్రేక్‌ రాలేదు.. బాలీవుడ్‌ లో కావల్సినన్ని ఆఫర్లూ రాలేదు. కాని ఏ పార్టీకి వచ్చినా ఏ ఫంక్షన్‌ లో కనిపించినా.. తన అందాల చమక్కులతో చంపేస్తుంటుంది. అదిగో నిన్న ఒక ఈవెంట్ లో అలాగే పిచ్చత్తెచ్చింది. క్లీవేజ్‌ ఆరబోతతో మతి పొగొట్టేసింది. అమ్మడుని చూసినవారంతా ఫ్లాటే.

ఈ పిల్ల తక్కువదేం కాదు.. పిచ్చ హాటే బాబోయ్‌.. అంటూ ఫిలిం నగర్‌ లో తెగ మాట్లాడుకుంటున్న తరుణంలో.. ఒక విషయం చెబుదాం. ఇప్పుడు జాకీ చాన్‌ తో చేస్తున్న కుంగ్‌ ఫూ యోగా హిట్టయితే అమ్మడు ఇటు రాకపోవచ్చు. కాని అది తేడా పడినా ఈమె క్యారెక్టర్‌ కు ఆశించినంత పేరు రాకపోయినా కూడా.. ఖచ్చితంగా అమ్మడు తెలుగు తెరపై అదృష్టం పరీక్షించుకోవడానికి వచ్చేస్తుందంతే.