Begin typing your search above and press return to search.

అమైరా.. ఇదొక్కటి మాత్రం నిజం

By:  Tupaki Desk   |   31 Oct 2015 5:26 AM GMT
అమైరా.. ఇదొక్కటి మాత్రం నిజం
X
అమైరా ద‌స్తూర్.. ఇటీవ‌లి కాలంలో టాలీవుడ్ స‌ర్కిల్స్‌ లో ఎక్కువ‌గా పాపులారిటీ పెంచుకుంటున్న పేరు ఇది. ఇప్ప‌టివ‌ర‌కూ ఒక్క సినిమాకి సంత‌కం చేయ‌క‌పోయినా ఇటీవ‌లి కాలంలో ఈ పేరు గురించి ఎక్కువ‌గానే ముచ్చ‌టించుకున్నారు. అమైరా ద‌స్తూర్ .. నాగ‌చైత‌న్య స‌ర‌స‌న ఈ అమ్మ‌డికి ఓ అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. అలాగే ఫ్యూచ‌ర్‌ లో చ‌ర‌ణ్ స‌ర‌స‌న త‌ని ఒరువ‌న్‌ లో నాయిక‌గానూ ప్ర‌య‌త్నిస్తోంద‌ని, మ‌హేష్‌ - ఎన్టీఆర్‌ - బ‌న్నిల‌తోనూ అవ‌కాశాల కోసం ప్ర‌య‌త్నిస్తోంద‌ని ఇటీవ‌ల ప్ర‌చార‌మైంది. అయితే ఈ అమ్మ‌డు లేటెస్టుగా త‌మిళంలో ఓ క్రేజీ ప్రాజెక్టుకు సంత‌కం చేసింద‌ట.

అట్ట‌క‌త్తి - పిజ్జా - సూదుక‌వ్వం - తెగిడి వంటి సూప‌ర్‌ హిట్ సినిమాల్ని నిర్మించిన సీవీ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో మాయావ‌న్ అనే చిత్రంలో ఛాన్స్ ద‌క్కించుకుంది. సందీప్ కిష‌న్ ఈ చిత్రంలో క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్నాడు. అమైరాకి త‌మిళంలో ఇదే మొద‌టి ఛాన్స్ కాదు. ఇప్ప‌టికే త‌మిళ స్టార్ హీరో ధ‌నుష్ స‌ర‌స‌న అనెగాన్ అనే చిత్రంలో క‌థానాయిక‌గా న‌టించింది. ఆ త‌ర్వాత మ‌ళ్లీ చెన్న‌య్‌ లో క‌నిపించ‌క‌పోయినా.. ముంబై ప‌రిశ్ర‌మ‌లో ఛాన్సుల కోసం వేటాడింది. ఓ వైపు ఉత్త‌రాది, మ‌రోవైపు ద‌క్షిణాది సినిమాల్లో న‌టించాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ఉందిప్పుడు.

దీపావ‌ళి త‌ర్వాత మాయావ‌న్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఎట్ట‌కేల‌కు ఇటీవ‌లి కాలంలో సాగించిన ప్ర‌య‌త్నాల్లో స్టార్ హీరోల స‌ర‌స‌న ఛాన్సులు రాక‌పోయినా.. అంటే నాగచైతన్య - రామ్‌ చరణ్‌ వంటి హీరోలతో సినిమాలంటూ న్యూస్‌ వచ్చిందిలే.. కాని చివరకు సందీప్‌ తో స‌రిపెట్టుకుంద‌న్న‌మాట‌. ఈమె గురించి ఆ స్టార్‌ తో చేస్తోంది ఈ స్టార్‌ తో చేస్తోంది అంటూ ఎన్ని రూమర్లు వచ్చిన కూడా ఇదొక్కటి మాత్రం నిజం.