Begin typing your search above and press return to search.

దిష్టి పోవడానికి ట్యాటూ వేయించుకుంది

By:  Tupaki Desk   |   22 Nov 2017 10:26 PM IST
దిష్టి పోవడానికి ట్యాటూ వేయించుకుంది
X
బాలీవుడ్ ప్రపంచంలో తారలు ప్రవర్తించే తీరు ఒక్కోసారి నిజంగా చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. సోషల్ మీడియా ప్రభావమో తారల మధ్య పోటీ ఎక్కువవ్వడేమో తెలియదు గాని నిరంతరం జనాలను ఆకర్షించడానికి ఒక్కొక్కరు ఒక్కో విధానంతో ముందుకు సాగుతున్నారు. విజయాలు లేకపోయినా అవకాశాలు రాకపోయినా వారి ప్రవర్తనతో బాగా ఇమేజ్ తెచ్చుకుంటున్నారు.

రీసెంట్ ఇదే తరహాలో ఒక నటి తన సరికొత్త ఆలోచన తో సోషల్ మీడియాలో తెగ పాపులర్ అవుతోంది. అంతే కాకుండా ఎక్కడికి వెళ్లినా అందరిని అమ్మడి వెనుక తిప్పుకునేల చేస్తోంది. ఆమె ఎవరో కాదు బాలీవుడ్ లో ప్రస్తుతం తన హాట్ అందాలతో అందరిని ఆకర్షిస్తోన్న అమైరా దస్తూర్. ఈ బ్యూటీ నటించింది కొన్ని సినిమాల్లోనే అయినా తన అందాలు చాలా ప్రత్యేకం అనేలా సినోమాల్లో హాట్ గా నటించింది. ఇక అసలు విషయం లోకి వస్తే.. ఈ భామ రీసెంట్ తన మెడ వెనుక ఒక కన్ను లాంటి చిన్న టాటూ వేయించుకుంది.

చెడు దృష్టి తనపై పడకుండా ఆ కన్ను రక్షణగా ఉంటుందని అమైరా అమితంగా నమ్ముతుందట. ఇక రోజు ఎన్నో చోట్ల తీరుగుతుంటాను సో.. మంచి చెడు ఎప్పుడు మనకు తెలియకుండా మనతో ప్రయాణిస్తూ ఉంటాయి. చెడు దృష్టి పోయేందుకు ఈ విధంగా ప్లాన్ చేసుకున్నానని ఈ భామ చెబుతోంది. సింపుల్ గా చెప్పాలంటే.. దిష్టి పోవడానికి టాటూ వేయించుకుందనమాట. ఇక ఎక్కడికైనా వెళితే అందరు అమైరా మెడను ఆసక్తిగా చుస్తున్నారట. ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ తమిళ్ ఒక సినిమాను అలాగే హిందీలో ఒక సినిమాను చేస్తోంది.