Begin typing your search above and press return to search.

వైట్ బ్యూటీ.. వైట్ హార్స్ ఫ్రెండు

By:  Tupaki Desk   |   1 March 2019 1:30 AM GMT
వైట్ బ్యూటీ.. వైట్ హార్స్ ఫ్రెండు
X
లండ‌న్ బ్యూటీ ఎమీజాక్స‌న్ గ‌త కొంత‌కాలంగా సినిమాల‌తో కంటే ఫోటోషూట్లు, షికార్ల‌తోనే ఎక్కువ‌గా కాల‌క్షేపం చేస్తోంది. బ్రిటీష్ బోయ్‌ఫ్రెండ్ జార్జిప‌నాయ‌ట్టుని పెళ్లాడ‌డ‌మే ధ్యేయంగా సినిమాలకు దూర‌మైంది ఎమీ. బోయ్‌ఫ్రెండ్ తో బికినీ బీచ్ సెల‌బ్రేష‌న్స్.. స‌హా ద‌క్షిణాఫ్రికా అడ‌వుల్లోనూ సెల‌బ్రేష‌న్స్ కి వెళ్లింది ఈ బ్యూటీ. మ‌రోవైపు వీలున్న‌ప్పుడ‌ల్లా క‌మ‌ర్షియ‌ల్ ప్ర‌క‌ట‌నల్లో న‌టిస్తూ బిజీగా ఉంటోంది. సామాజిక మాధ్య‌మాల్లోనూ ఆన్ లైన్ ర‌మ్మీ స‌హా ర‌క‌ర‌కాల కాస్ట్యూమ్స్, షూటింగ్స్ అండ్ ష‌ర్టింగ్స్ కి ప్ర‌చారం చేస్తోంది.

తాజాగా మ‌రోసారి ఓ కొత్త ప్ర‌క‌ట‌న‌తో వేడి పెంచింది ఎమీజాక్స‌న్. 2019 ర్యాండాక్స్ హెల్త్ గ్రాండ్ నేష‌న‌ల్ లేడీస్ డే అంబాసిడ‌ర్ గా ఎంపిక‌య్యాన‌ని ఆనందంతో ఉబ్బి త‌బ్బిబ్బ‌వుతూ చెప్పుకొచ్చింది. ఈ ఏడాది నా లైఫ్ లో బెస్ట్ డే ఇది.. అంటూ ఓ ఫోటోని అభిమానుల కోసం షేర్ చేసింది. జాకీ క్ల‌బ్ పేరుతో ఇదిగో ఇలా గుర్రాల‌శాల‌కు బ్రాండ్ ప్ర‌మోష‌న్ చేయ‌బోతోంద‌ని అర్థ‌మ‌వుతోంది. అన్న‌ట్టు త‌న ప్రియుడు జార్జి ప‌నాయ‌ట్టు విలాస పురుషుడు. హార్స్ రేసింగ్.. ర‌మ్మీ ప్లే వంటి గేమ్స్ లో కేస‌నోవా త‌ర‌హా యాటిట్యూడ్ తో విలాసాల్లో మునిగి తేల‌తాడ‌ని ప్ర‌చారం ఉంది. ఆ అల‌వాట్లు అన్నీ త‌న‌కు కూడా అల‌వాటైన‌ట్టే క‌నిపిస్తోంది మ‌రి.

జార్జిని పెళ్లాడాక అయినా కాస్తంత కంట్రోల్‌లో ఉంటే మంచిది. ఇద్ద‌రూ ఖ‌ర్చు పెట్టేస్తే నిల‌బ‌డేది కాపురం కాదు.. క‌ల‌త‌లు.. కాబ‌ట్టి కాస్త జాగ్ర‌త్త‌గా ఉండాలి అంటూ అనుభ‌వంతో అభిమానులే సెల‌విస్తున్నారు! అన్న‌ట్టు 2.0 త‌ర్వాత ఎమీజాక్సన్ ఏదైనా సినిమాకి సంత‌కం చేసిందా? అంటే స‌ల్మాన్ భాయ్ స‌ర‌స‌న ఓ చిత్రానికి సంత‌కం చేసింద‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఈ సినిమా ప్రీప్రొడ‌క్ష‌న్ ద‌శ‌లోనే ఉంది.