Begin typing your search above and press return to search.

క్వీన్ రీమేక్ నుండి ఆమె వాకౌట్?

By:  Tupaki Desk   |   31 Oct 2017 12:27 PM IST
క్వీన్ రీమేక్ నుండి ఆమె వాకౌట్?
X
బాలీవుడ్ మూవీ క్వీన్ ను సౌత్ లో రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. కన్నడలో బటర్ ఫ్లై పేరుతో పరుల్ యాదవ్ హీరోయిన్ గా ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటున్న ఈ రీమేక్ ను.. తెలుగులో తమన్నా హీరోయిన్ గా రూపొందించే ప్రణాళికలున్నాయి. తమిళ్ లో పారిస్ పారిస్ పేరుతో కాజల్ తో తెరకెక్కించనుండగా.. మలయాళంలో మంజిమా మోహన్ క్వీన్ రోల్ చేయనుంది.

అయితే క్వీన్ మూవీలో మరో హీరోయిన్ పాత్ర ఉంటుంది. లీసా హేడెన్ చేసిన ఈ పాత్ర కోసం.. సౌత్ లో అమీ జాక్సన్ ను తీసుకున్నారు. ఇప్పటికే అఫీషియల్ స్టేట్మెంట్ కూడా రాగా.. ఇప్పుడీ సినిమా నుంచి అమీ తప్పుకున్నట్లు తెలుస్తోంది. అనుకున్న సమయం కంటే షూటింగ్ ఆరంభం ఆలస్యం కావడంతో.. తనకు కాల్షీట్స్ సమస్య ఎదురవుతోందని చెప్పిందట అమీ జాక్సన్. అమెరికన్ టీవీ సిరీస్ సూపర్ గాళ్ లో నటించాల్సి ఉందని.. క్వీన్ ప్రాజెక్టుకు రాంరాం చెప్పేసిందని టాక్ వినిపిస్తోంది.

నిజానికి ప్రస్తుతం ఈమె రేంజ్ వేరు. రోబో సీక్వెల్ 2.0 హీరోయిన్ గా కెరీర్ పీక్ స్టేజ్ లో ఉంది. ఇలాంటి సమయంలో ఓ సైడ్ క్యారెక్టర్ చేయడం అమీకు ఇష్టం లేదట. ఇలాంటి చిన్న పాత్రలు చేసి తన స్థాయిని తానే తగ్గించుకోవడం ఇష్టం లేకనే.. రకరకాల రీజన్స్ చెప్పి ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందని అంటున్నారు.