Begin typing your search above and press return to search.

అమీ కంటే సన్నీ బెటర్!!

By:  Tupaki Desk   |   6 April 2017 5:02 AM GMT
అమీ కంటే సన్నీ బెటర్!!
X
నిన్న హైద్రాబాద్ లో ఐపీఎల్ లేటెస్ట్ సీజన్ ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఓపెనింగ్ సెరమనీ అదిరిపోయేలా ప్లాన్ చేసుకున్న నిర్వాహకులు.. అమీ జాక్సన్ విషయంలో మాత్రం తప్పు చేశారనే టాక్ వినిపిస్తోంది. ప్రతీ ఏటా ఓ బాలీవుడ్ స్టార్ భామకు భారీగా ముట్టచెప్పి.. ఐపీఎల్ ప్రారంభోత్సవంలో డ్యాన్సులు వేయించడం ఆనవాయితీ.

అలాగే ఈసారి మాంచి ఊపులో ఉన్న అమీజాక్సన్ ను పట్టుకొచ్చారు. కానీ ఈమె డ్యాన్స్ పెర్ఫామెన్స్ మాత్రమే కాదు.. డ్యాన్సింగ్ స్కిల్స్ కూడా అందరినీ నిరుత్సాహపరిచాయి. ఇండియావైడ్ గా ట్రెండింగ్ అండ్ ట్రాలింగ్ కు గురయ్యాయి. పలు బాలీవుడ్ గీతాల మెడ్లేకు డ్యాన్స్ చేసిన ఈమె.. తన అందుకున్న పారితోషికం స్థాయికి తగ్గట్లుగా నర్తించలేకపోయింది. దీంతో సోషల్ మీడియాలో అమీపై తెగ జోకులు పేలుతున్నాయి. 'అమీ జాక్సన్ కంటే సన్నీ డియోల్ మంచి డ్యాన్సర్' అనే అభిప్రాయం ఎక్కువగా వినిపించిందంటే.. ఈవిడగారి నాట్యం ఏ స్థాయిలో ఉందో తెలుస్తుంది.

'అమీ డ్యాన్స్ జుంబా క్లాసులో ఇన్ స్ట్రక్టర్ ఎదురుగా లేనపుడు ఇష్టం వచ్చినట్లు చేసినట్లుగా ఉంది' అనేస్తున్నారు నెటిజన్లు. ఐపీఎల్ 10వ సీజన్ ఆరంభాన్ని అదరగొడుతుందని అమీపై ఆశలు పెట్టుకుంటే.. ఆమె మాత్రం వాటిపై తన డ్యాన్స్ తో నీళ్లు చల్లేసింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/