Begin typing your search above and press return to search.

రజినీ హీరోయిన్ పాట పాడుతోంది

By:  Tupaki Desk   |   21 April 2016 11:24 AM IST
రజినీ హీరోయిన్ పాట పాడుతోంది
X
బ్రిటన్ భామ అయిన అమీ జాక్సన్.. మోడల్ నుంచి నటిగా మారి సినిమా ఇండస్ట్రీలో సెటిల్ అయిపోయింది. ప్రస్తుతం సౌతిండియా సూపర్ స్టార్ రజినీకాంత్ తో శంకర్ తెరకెక్కిస్తున్న రోబో సీక్వెల్ 2.0లో నటిస్తోంది అమీ జాక్సన్. అటు అందంతో పాటు, ఇటు నటనలో కూడా బాగా ట్యాలెంటెడ్ కావడంతో.. ఆఫర్లకు కొదువ లేదు కానీ.. ఎంపికలో మాత్రం ఆచి తూచి వ్యవహరించడం అమీకి ఆనవాయితీ.

హీరోయిన్ గా కెరీర్ సక్సెస్ ఫుల్ స్టేజ్ లో ఉండగానే కొత్త ట్రయల్ ఒకటి వేస్తుంది అమీ జాక్సన్. అదే సింగర్ గా మారిపోవడం. ఇంగ్లీష్-పంజాబీ-హిందీ భాషల్లో రూపొందనున్న వీడియో సింగిల్ ని చేయనుంది అమీ. ఇవాల్టి రోజుల్లో హీరోయిన్స్ సింగిల్స్ చేయడం పెద్ద విచిత్రమేమీ కాదు కానీ.. ఈ వీడియో ద్వారా సింగర్ కూడా పరిచయం కానుండడమే అసలు విషయం.

మ్యూజీషియన్స్ అయిన రాఫ్తార్ - మంజీత్ రాల్ లు రూపొందించనున్న సింగిల్ లో గొంతు కలపనుంది అమీ జాక్సన్. ఈ విషయాన్ని అధికారికంగానే ప్రకటించారు. హిందీ వెర్షన్ కి అమీ పాడనుండడమే అన్నిటికంటే పెద్ద విషయం అంటున్నారు ఈ మ్యూజిక్ డైరెక్టర్లు. మరి.. సింగర్ కం యాక్ట్రెస్ గా అమీ ఏ రేంజ్ లో అలరించనుందో!!