Begin typing your search above and press return to search.

షాకింగ్ ట్విస్టు: ఎమీజాక్సన్ ఫ్రెగ్నెన్సీ!

By:  Tupaki Desk   |   31 March 2019 10:04 AM GMT
షాకింగ్ ట్విస్టు: ఎమీజాక్సన్ ఫ్రెగ్నెన్సీ!
X
బ్రిటీష్ టాప్ మోడ‌ల్ .. అందాల క‌థానాయిక ఎమీజాక్స‌న్ త‌ల్లి కాబోతోందా? అంటే అవున‌నే అధికారిక స‌మాచారం. ఆ మేర‌కు తాను గ‌ర్భిణి అన్న విష‌యాన్ని ఎమీజాక్స‌న్ నేడు ప్ర‌క‌టించి పెద్ద షాకిచ్చింది. వాస్త‌వానికి నేడు బ్రిట‌న్ లో మ‌ద‌ర్స్ డే సెల‌బ్రేష‌న్స్ ఘ‌నంగా నిర్వ‌హిస్తున్నారు. ఇలాంటి వేళ టైమ్ చూసి ఆ టాప్ సీక్రెట్ ని ఎమీ జాక్సన్ రివీల్ చేయ‌డం అభిమానుల్లో హాట్ టాపిక్ అయ్యింది.

ఎమీ గ‌త కొంత‌కాలంగా ఎందుక‌నో సైలెంట్ గా ఉంటోంది. 2.0 త‌ర్వాత వేరొక సినిమాకి సంత‌క‌మైనా చేయ‌లేదు! అంటూ మీడియా ఇటీవ‌ల ఆశ్చ‌ర్యాన్ని వ్యక్తం చేసింది. ఎమీ నిరంత‌రం గ్యాప్ లేకుండా లండ‌న్ ప్రియుడు జార్జి ప‌నాయ‌ట్టుతో క‌లిసి దేశ‌ విదేశాల్లోని ఒంట‌రి దీవుల‌కు షికార్లు చేస్తుండ‌డంపైనా ప‌లు అనుమానాలు వ్య‌క్త‌మ‌య్యాయి. ఎట్ట‌కేల‌కు ఆ అనుమానాలే నిజ‌మై.. ఇప్పుడు రిజ‌ల్ట్ కూడా వ‌చ్చేసింది. ఎమీజాక్స‌న్ ఫ్రెగ్నెంట్. సాధ్య‌మైనంత తొంద‌ర్లోనే పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌బోతోంది. అందుకు సంబంధించిన బేబి బంప్ ఫోటోల్ని ఎమీజాక్స‌న్ స్వ‌యంగా అంత‌ర్జాలంలో రివీల్ చేయ‌డం బిగ్ షాక్ కి కార‌ణ‌మైంది.

``నేను ఎంతో కాలంగా వేచి చూస్తున్న అరుదైన రోజు ఇది. ఇంటి పైక‌ప్పు ఎగిరిపోయేలా ఓ సంగ‌తిని ప్ర‌క‌టించాల‌ని అనుకుంటున్నా. ఆ రోజు ఈరోజే. మ‌ద‌ర్స్ డే ని మించి ఇంకేదీ లేదు. ఇదే స‌రైన‌ది అని భావిస్తున్నా. ఈ ప్ర‌పంచంలో నిన్ను ప్రేమించినంత‌గా ఇక దేనినీ ప్రేమించ‌లేదు. ఎంతో స్వ‌చ్ఛ‌మైన నిజాయితీ ఉన్న ప్రేమ ఇది. మ‌నం ఇంకా ఆగ‌లేం.. మ‌న లిటిల్ లిబ్రాని క‌ల‌వ‌కుండా వేచి చూడ‌లేం`` అంటూ త‌న బోయ్ ఫ్రెండ్ కి గ‌ట్టిగానే చెప్పింది ఎమీజాక్స‌న్. పెళ్లి కాకుండానే ఫ్రెగ్నెన్సీయా? అని లండ‌న్ లో ప్ర‌శ్నించ‌కూడదు. బ్రిటీష్ సాంప్ర‌దాయంలో ఇవి చాలా మామూలు విష‌యాలే .. జ‌స్ట్ పెళ్లికి ముందు ఫ్రెగ్నెన్సీ అని స‌రిపెట్టుకోవాలి. ఇంత‌కాలం ఎమీ ఎందుకంత సైలెంట్ ఆ ఉందో ఇప్పుడైనా అర్థ‌మైందా?