Begin typing your search above and press return to search.

ముంబైకి మకాం మార్చిన లండన్ బ్యూటీ

By:  Tupaki Desk   |   26 April 2016 1:00 PM IST
ముంబైకి మకాం మార్చిన లండన్ బ్యూటీ
X
ఎవడు చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన ఓ హీరోయిన్ గా నటింటిన అమీ జాక్సన్.. అక్కడి నుంచి వరుసగా సూపర్ ఆఫర్స్ చేజిక్కించుకుంది. ట్యాలెంటెడ్ డైరెక్టర్ తో శంకర్ తో 'ఐ' మూవీ చేసిన అమీ.. ఇప్పుడు రజినీకాంత్-శంకర్ కాంబినేషన్ లో వస్తున్న రోబో సీక్వెల్ లో హీరోయిన్ గా నటిస్తోంది. బ్రిటిష్ మోడల్ గా కెరీర్ ప్రారంభించిన ఈ సుందరి.. ఇప్పుడు ఇండియాలో పర్మనెంట్ గా సెటిల్ అయిపోయేందుకు ప్లాన్స్ వేసేసుకుంది.

రీసెంట్ గా అమ్మడు ముంబైలోని ఓ పోష్ లొకాలిటీ ఇల్లు కొనేసింది. ఖర్ ఏరియా లోని ఓ 3బెడ్ రూమ్ అపార్ట్ మెంట్ లోకి.. అమ్మతో కలిసి అమీ షిఫ్ట్ అయిపోయింది కూడా. నిజానికి ఇలా ముంబైలో ఓ సొంతిల్లు కొందామనే ఆలోచన చాలా కాలం నుంచే ఉన్నా.. మొదట ఈమె టేస్ట్ కి తగ్గట్లుగా హౌజ్ సెలెక్ట్ చేసుకోవాడనికి లేట్ అయింది. ఆ తర్వాత.. దాన్ని తన అభిరుచులకు అనుగుణంగా మార్చుకునేందుకు కొన్ని నెలల టైం తీసుకుందట అమీ జాక్సన్.

అసలు ఇక్కడ ఇంత ఇన్వెస్ట్ చేసి ఇల్లు కొనడం కరెక్టా కాదా అని చాలా ఆలోచించేసి, చివరకు సొంత డబ్బులతో అయితే కొందామని డిసైడ్ అయిందట అమీ. అలా కొన్నదే ఇప్పుడు అమీ ఉంటున్న నివాసం. మొత్తానికి అటు కెరీర్ లోను, ఇటు సొంతింటి విషయంలోనూ అనుకున్నది సాధించింది అమీ జాక్సన్. 'ఇక్కడ నాకు వస్తున్న ఆఫర్స్ చాలా సంతోషాన్ని ఇస్తున్నాయి. ముంబైకి నివాసం మారడం హ్యాపీగా ఉంది' అంటోంది అమీ జాక్సన్.