Begin typing your search above and press return to search.

కెమెరాకి చిక్కిన జిలెటిన్ స్టిక్‌

By:  Tupaki Desk   |   2 Aug 2018 8:03 AM GMT
కెమెరాకి చిక్కిన జిలెటిన్ స్టిక్‌
X

బికినీల‌తో చెల‌రేగిపోవ‌డం.. టూపీస్‌లో మ‌త్తు చ‌ల్ల‌డం ఈ అమ్మ‌డికి కొత్తేం కాదు. లండ‌న్ టు ముంబై - ముంబై టు మ‌ద్రాస్‌ - మ‌ద్రాస్ టు హైద‌రాబాద్ ఈ భామ ప‌య‌నం ఎంతో ఇంట్రెస్టింగ్‌. ఇన్ని న‌గ‌రాల్లో కంచె వేసి అసాధార‌ణ స్టార్‌ డ‌మ్‌ ని ఛేజిక్కించుకున్న లండ‌న్ బ్యూటీగా ఇప్ప‌టికే సంచ‌ల‌నాల‌కు కేంద్రం అయ్యింది. సూప‌ర్‌ స్టార్ ర‌జ‌నీకాంత్ స‌ర‌స‌న 2.ఓ చిత్రంలో న‌టిస్తూ మోస్ట్ పాపుల‌ర్ స్టార్‌ గా పేరు తెచ్చుకుంది. అంత‌కుమించి పాశ్చాత్య దేశాల‌కు సూప‌ర్‌ గాళ్ వెబ్ సిరీస్‌ తో చేరువైంది. ఇక‌మీద‌ట బ్రిట‌న్ బిజినెస్ మ్యాగ్నెట్ .. వేల కోట్ల అధిప‌తి అయిన జార్జి ప‌నాయ‌ట్టుని పెళ్లాడి స్వ‌ర్గ‌లోకంలో విహ‌రించాల‌నుకుంటోంది.

అంతేకాదు వీలు చిక్కిన‌ప్పుడ‌ల్లా జార్జితో క‌లిసి ఈ భామ ఒంట‌రి ధీవుల్లో వీర‌విహారం చేస్తోంది. అక్క‌డ రెస్టారెంట్లు - కాఫీ షాప్‌ లు - స్విమ్మింగ్ పూల్స్ కాదేదీ ఎంజాయ్‌ క‌న‌ర్హం అన్న తీరుగా న‌చ్చిన‌ట్టు సెల‌బ్రేట్ చేస్తోంది. ఈ సెల‌బ్రేష‌న్స్ ఇప్ప‌టికే ఇన్‌ స్టాగ్ర‌మ్‌ ల‌కెక్కి యూత్‌ని ఓల‌లాడించాయి. ఇదిగో ఈ సిరీస్‌ లో భాగంగా తాజా ఎపిసోడ్ ఇలా వెబ్‌ లోకి లీకైంది. ఈ ఫోటోలో ఎమీ లుక్స్ సంథింగ్ స్పెష‌ల్‌. ప్ర‌తిసారీ ఫోటోల్లో ఏదో ఒక క్రియేటివిటీ చూపించే ఈ అమ్మ‌డు.. జిలెటిన్ స్టిక్‌ లా పేలేందుకు రెడీగా క‌నిపిస్తోంది. లెక్క‌గా కొల‌త‌లు కొలిచి ఇలా ప‌రిమిత వ‌స్త్ర‌ధార‌ణతో చూపులు తిప్పుకోనివ్వ‌డం లేదు. ప‌సుపు వ‌ర్ణం లేసుల టాప్‌ - బులుగు జిలుగు జీన్స్ బాట‌మ్‌లో త‌ళాంగు త‌ళుకులు ప్ర‌ద‌ర్శించింది. రేబాన్ గ్లాస‌స్‌ తో ఉర‌కలెత్తించింది. స్ట‌న్నింగ్ ఎమీ..!