Begin typing your search above and press return to search.
చిట్టి కన్నయ్య 2.0 లేటెస్ట్ ఫోటో
By: Tupaki Desk | 1 Oct 2019 10:43 AM GMTచిట్టి కన్నయ్య 2.0 అరైవ్డ్ అయిన సంగతి తెలిసిందే. బ్రిటీష్ బ్యూటీ ఎమీజాక్సన్ వారసుడిగా కన్నయ్య 2.0 కు అప్పుడే బోలెడంత ఫాలోయింగ్ ఏర్పడింది. ఎమీ తన బిడ్డడికి ఆండ్రియాస్ అని పేరు పెట్టి ఇలా ఇన్ స్టాలో ఫోటోల్ని షేర్ చేయడమే ఆలస్యం వెంటనే అలా జెట్ స్పీడ్ తో జోరుగా వైరల్ అయిపోయాయి. ఇప్పటికే రెండు ఫోటోలు వెబ్ మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఆండ్రియాస్ ని అరచేతుల్లోకి తీసుకుని తన భర్తతో కలిసి ముద్దాడుతున్న ఫోటోని షేర్ చేస్తే అది కాస్తా రాకెట్ స్పీడ్ తో ఫ్యాన్స్ లో వైరల్ అయిపోయింది. తాజాగా మరో ఫోటోని ఎమీజాక్సన్ షేర్ చేసింది. ఆండ్రియాస్ ఈసారి స్టన్నింగ్ అనిపించే ఎక్స్ ప్రెషన్ ఇచ్చాడు. కళ్లు మూసేసి.. తన ముఖాన్ని అరచేతిలోకి వాల్చాడు. ఆ ఫోటో ఇలా షేర్ చేయగానే లక్షన్నర లైక్స్ వచ్చేశాయి రెండు గంటల్లోనే. ఇప్పటికే అభిమానులు బోలెడన్ని కామెంట్లతో హోరెత్తించారు. అందులో చాలా కామెంట్లు వేడెక్కిస్తున్నాయి. డియర్ ఎమీ.. సేమ్ టు సేమ్ నీలానే ఉన్నాడు! అంటూ ఓ అభిమాని కామెంట్ చేశాడు. ఒకవేళ నువ్వు ఇండియాలోనే ఉండి ఉంటే ఆ బుగ్గలపై ఓ కాటుక చుక్కను పెట్టేవాడిని... అసలు ఆండ్రియాస్ ని కలిసే ఆ అరుదైన క్షణం వరకూ ఆగలేనేమో! వ్వాటే లిటిల్ బ్యూటీ... అంటూ ఎమోషన్ అయిపోయాడు ఓ అభిమాని. వేరొక అభిమాని ``ఈ లిటిల్ ఏంజెల్ ఎంత క్యూట్ గా ఉన్నాడో`` అంటూ సంబరపడిపోయాడు. ఇంతకుముందు ఎమీ షేర్ చేసి ఫోటోలకు ఇలానే శుభాకాంక్షలతో పాటు రకరకాల కామెంట్లతో ఫ్యాన్స్ హోరెత్తించారు.