Begin typing your search above and press return to search.
2.0 బ్యూటీకి అదే శాపం
By: Tupaki Desk | 16 April 2019 10:37 AM ISTకొన్నిసార్లు విధి అంతే. ఊహించని మలుపులతో జీవితాన్ని తిప్పేసి అదృష్టాన్ని దురదృష్టంగా మార్చేస్తుంది. బ్రిటిష్ సుందరి అమీ జాక్సన్ కి ఇది అనుభవంలోకి వస్తున్నట్టు ఉంది. బాయ్ ఫ్రెండ్ తో సహజీవనాన్ని గర్భం దాకా తెచ్చేసుకున్న అమీ వాటి తాలూకు ఫోటోలతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇవి హాట్ టాపిక్ గా మారాయి. ఎవరికి రాని కడుపు నీకే వచ్చిందా అంటూ ఈ పిక్స్ చూసిన తర్వాత కొందరు నెటిజెన్ల నుంచి కామెంట్స్ కూడా వచ్చాయి అది వేరే విషయం.
విశ్వసనీయ సమాచారం మేరకు అమీ జాక్సన్ ఇప్పుడీ ప్రెగ్నెన్సీ వల్ల బంగారం లాంటి ఓ ఛాన్స్ మిస్ అయ్యిందని ఫిలిం నగర్ టాక్. అదే ఆర్ ఆర్ ఆర్. జూనియర్ ఎన్టీఆర్ సరసన ఓ విదేశీ భామ అవసరమైన నేపథ్యంలో ఇప్పుడు అమీ జాక్సన్ అయితే మంచి ఛాయస్ గా నిలిచేది. ఎలాగూ తన డెబ్యూ జరిగింది రామ్ చరణ్ ఎవడుతోనే కాబట్టి ఇక్కడి వాతావరణంతో ఇబ్బంది లేదు. ఐ ఆడకపోయినా మనవాళ్ళలో అమీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అందుకే తనైతే ఇబ్బంది ఉండేది కాదు.
ఇప్పుడీ గర్భం వల్ల ఛాన్స్ పోయిందని వినికిడి. గత ఏడాది ఎన్నో ఆశలు పెట్టుకున్న 2.0తో పాటు కన్నడలో చేసిన క్రేజీ మల్టీ స్టారర్ విలన్ రెండూ ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో అమీ తల్లి కావాలని నిర్ణయించుకుంది. ఈ లోపు ఇలా ఆర్ ఆర్ ఆర్ రూపంలో సూపర్ ఆఫర్ మిస్ చేసుకుంది. అంతే టైం అలా కనికట్టు చేస్తుంది. అన్ని మన చేతుల్లో ఉండవు అని చెప్పడానికి ఇంత కన్నా ఉదాహరణ కావాలా