Begin typing your search above and press return to search.

కొత్త సంవ‌త్స‌రంలో మ‌రో పెళ్లి

By:  Tupaki Desk   |   2 Jan 2019 5:19 AM GMT
కొత్త సంవ‌త్స‌రంలో మ‌రో పెళ్లి
X
కొత్త సంవ‌త్స‌రంలో కొత్త గోల్స్ సెట్ చేసుకుంటున్నారంతా. కొంద‌రికి కెరీర్ ప‌ర‌మైన గోల్స్ ఉంటే మ‌రికొంద‌రికి `పెళ్లి` అనేది ఒక గోల్. ఈ గోల్ ని రీచ్ అవుతారో లోదో కానీ, ఇప్ప‌టికైతే 2019 కోటి ఆశ‌ల్ని రేకెత్తిస్తోంది. త‌న‌వైన అంద‌చందాలు, గ్లామ‌ర్ ఎలివేష‌న్ తో ద‌శాబ్ధ కాలంగా సౌత్‌ ఆడియెన్ ని ఉర్రూత‌లూగిస్తున్న లండ‌న్ బ్యూటీ ఎమీజాక్సన్ ఈ సంవ‌త్స‌రం పెళ్లి చేసుకుని ఓ ఇంటిది కానుంద‌ని తెలుస్తోంది.

ఆ మేర‌కు ఎమీజాక్స‌న్ ఇప్ప‌టికే సామాజిక మాధ్య‌మాల్లో ఫ్యాన్స్ కు క్లూ ఇచ్చింది. కొత్త సంవ‌త్స‌రం సెల‌బ్రేష‌న్స్ కోసం జాంబియాలోని ఎగ్జోటిక్ లొకేష‌న్ల‌కు ఎగిరి వెళ్లిపోయిన ఎమీజాక్స‌న్, అక్క‌డ ప్రియుడు జార్జి ప‌నాయ‌ట్టును ఓ ప‌ట్టు ప‌ట్టిన‌ట్టే అర్థ‌మ‌వుతోంది. ``జీవితంలో కొత్త సాహ‌సాలు మొద‌లైన‌ట్టే... ఐ ల‌వ్ యు... ప్ర‌పంచంలోనే ఎంతో హ్యాపీయెస్ట్ గాళ్ ని చేసినందుకు..`` అంటూ ప్రియుడు జార్జిపై ముద్దుల వ‌ర్షం కురిపించింది. అంతేకాదు ఈ వ్యాఖ్య‌తో పాటుగా ``నిశ్చితార్థ ఉంగరం ఈమోజీ``ని ఎమీజాక్స‌న్ పోస్ట్ చేసింది. దీంతో ఇక ఎమీ లాక్ అయిన‌ట్టేన‌ని అర్థ‌మ‌వుతోంది.

జార్జి ప‌నాయ‌ట్టు లండ‌న్ లో మ‌ల్టీ మిలియ‌నీర్. అత‌డికి భారీగా ఆస్తులు ఉన్న సంగ‌తి తెలిసిందే. ఎమీజాక్స‌న్ ఇండియాలో పెద్ద స్టార్ అని ప్రూవ్ చేసుకుని అటు పై హాలీవుడ్ లో సూప‌ర్ ఉమెన్ త‌ర‌హా వెబ్ సిరీస్‌ తో ఫేమ‌స్ అయ్యింది. ప్ర‌ఖ్యాత డీసీ కామిక్స్ ఎమీజాక్స‌న్ తో వండ‌ర్ ఉమెన్ త‌ర‌హాలో `సూప‌ర్ ఉమెన్` సినిమా తీయనుంద‌ని ఇదివ‌ర‌కూ ప్ర‌చార‌మైంది. కొత్త సంవ‌త్స‌రంలో పెళ్లితో పాటు, కెరీర్ ప‌రంగా ఇంకా కొత్త గోల్స్ తో దూసుకుపోతుందేమో చూడాలి. గ‌త ఏడాది అనుష్క శ‌ర్మ‌, సోన‌మ్ క‌పూర్, శ్రీయ‌, దీపిక ప‌దుకొనే, ప్రియాంక చోప్రా పెళ్లి చేసుకుని సంసార సాగ‌రంలోకి అడుగుపెట్టారు. ఈ ఏడాది ఎమీజాక్స‌న్ పెళ్లికి రెడీ!!