Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: బిడ్డ త‌ల్లి అయ్యాకా అగ్గి రాజేస్తోందిలా

By:  Tupaki Desk   |   24 Dec 2020 2:19 PM IST
ఫోటో స్టోరి: బిడ్డ త‌ల్లి అయ్యాకా అగ్గి రాజేస్తోందిలా
X
2.0 లో రోబో గాళ్ గా న‌టించింది ఎమీ జాక్స‌న్. ఆ త‌ర్వాత లండ‌న్ బిజినెస్ మ్యాగ్నెట్ జార్జి ప‌నాయ‌టౌతో ప్రేమ‌లో మునిగింది. ఫ‌లితంగా ఒక బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. బిడ్డ ఆండ్రియాస్ జ‌న‌నం అనంత‌రం నిశ్చితార్థం చేసుకుని త్వ‌ర‌లోనే జార్జిని పెళ్లాడేస్తున్నా అంటూ ప్ర‌క‌టించింది. దాంతో అభిమానులు చాలా సంతోషించారు. అయితే ఆ త‌ర్వాత పెళ్లికి సంబంధించిన వార్త అయితే రాలేదు.

ఎమీజాక్స‌న్ నిశ్చితార్థం అనంత‌రం చాలా మంది తోటి తార‌లు పెళ్లాడి లైఫ్ లో సెటిల‌య్యారు కానీ త‌న నుంచి మాత్రం క్లియ‌ర్ క‌ట్ గా స‌మాచారం ఏదీ లేదు. ఇక‌పోతే జార్జితో రొమాంటిక్ లైఫ్ విష‌యంలో మాత్రం ఎమీ ఎక్క‌డా త‌గ్గ‌లేదు. ఇటీవ‌ల ప‌లుమార్లు బీచ్ వెకేష‌న్ కి సంబంధించిన ఫోటోల్ని అలాగే ఆండ్రియాస్ తో క్యూట్ స‌న్నివేశాల్ని ఎమీజాక్స‌న్ షేర్ చేసింది.

ప్ర‌స్తుతం లండ‌న్ -యూకేని స్ట్రైన్(క‌రోనా) వైర‌స్ ఒణికిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆ క్ర‌మంలోనే ఎమీజాక్స‌న్ ఈ హాటెస్ట్ ఫోటోని షేర్ చేసి మ‌రో మెగా లాక్ డౌన్ ఏదీ లేదు! అంటూ వ్యాఖ్య‌ను జోడించింది. అంటే బ్రిట‌న్ లో భ‌యాందోళ‌ల‌పై బ‌య‌ట జ‌రుగుతున్న ప్ర‌చారాన్ని ఈ భామ ఖండించిన‌ట్టే అనుకోవాలి.