Begin typing your search above and press return to search.

ఎమీ జాక్సన్‌.. రచ్చ రచ్చంతే

By:  Tupaki Desk   |   13 Dec 2015 7:30 AM GMT
ఎమీ జాక్సన్‌.. రచ్చ రచ్చంతే
X
ఆర్య‌ - విక్ర‌మ్‌ - ధ‌నుష్‌ - రామ్‌ చ‌ర‌ణ్‌ - ఉద‌య‌నిధి స్టాలిన్.. ఇంత‌మంది సౌత్ స్టార్ల‌తో న‌టించేసింది ఎమీ జాక్స‌న్‌. ఇది అరుదైన ట్రాక్ రికార్డు. ఎక్క‌డో పుట్టి ఎక్క‌డో పెరిగి, ఇక్క‌డే క‌లిసింది ఈ అమ్మ‌డు. ఎ.ఎల్‌.విజ‌య్ పుణ్య‌మా అని ఈ అమ్మ‌డు మ‌ద‌రాసిప‌ట్ట‌ణంలో న‌టించ‌క‌పోయి ఉంటే ప‌రిస్థితేంటో? ఆ రోజు ఎమీజాక్స‌న్ అస్స‌లు ఊహించి ఉండ‌దు. తాను ఓ పెద్ద స్టార్ హీరోయిన్ అవుతాన‌ని, సౌత్‌ ని ఏల్తాన‌ని.. ఇప్పుడు అటు ముంబై ప‌రిశ్ర‌మలోనూ చ‌క్రం తిప్పేందుకు రెడీ అవుతోంది.

ఇటీవ‌లే అక్ష‌య్ కుమార్ స‌ర‌స‌న సింగ్ ఈజ్ బ్లింగ్‌ లో రెడ్ హాట్ బికినీలో క‌నిపించి మ‌తులు చెడ‌గొట్టింది. లేటెస్టుగా మ‌రో హిందీ సినిమాలో న‌టించే చాన్స్ అందుకుంది. సేమ్ టైమ్ సూప‌ర్‌ స్టార్ ర‌జ‌నీకాంత్ స‌ర‌స‌న రోబో- 2 లాంటి ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రంలో నాయిక‌గా న‌టించే ఛాన్స్ అందుకుంది. స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఒక్క‌సారి అవ‌కాశం రావ‌డ‌మే క‌ష్టం. అలాంటిది .. రెండోసారి న‌టించే చాన్స్ ఇచ్చారు. ... అంటూ ఆనందంతో ఉబ్బిత‌బ్బిబ్బ‌వుతోంది. ర‌జ‌నీ పుట్టిన రోజు సంద‌ర్భంగా నిన్న‌నే ఈ సినిమా ఠెంకాయ కార్య‌క్ర‌మం పూర్త‌యింది.

ఈ సినిమాతో పాటు ధ‌నుష్ స‌ర‌స‌న న‌టించిన తంగ‌మ‌గ‌న్ ఈనెల 18న రిలీజ్‌ కి వ‌స్తోంది. అలాగే ఉద‌య‌నిధి స్టాలిన్ స‌ర‌స‌న మ‌రో చిత్రంలో న‌టిస్తోంది ఎమీ. విజయ్‌ సినిమా కూడా చేస్తోంది. రచ్చ రచ్చంతే!!