Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: అందాలు అలా ఉంటాయి

By:  Tupaki Desk   |   8 May 2018 6:02 AM GMT
ఫోటో స్టోరి: అందాలు అలా ఉంటాయి
X
ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై తనదైన శైలిలో సత్తా చాటుతున్న బ్రిటిష్ బ్యూటీ అమీ జాక్సన్. ఎలాంటి సినిమాకైనా అమ్మడి అందాలు చాలా ఉపయోగపడతాయి అనే విధంగా కనిపిస్తుంటుంది. ఏ సైడ్ నుంచి ఆఫర్ వచ్చినా కూడా నో చెప్పడం లేదు. వీలైనంత వరకు మనం ఎంతవరకు ఆ పాత్రకు న్యాయం చేయగలం ఆమె తరహాలోనే ఆలోచిస్తుంటుంది. ఇక ఎంత బిజీగా ఉన్నప్పటికీ అమ్మడు హాలిడేస్ ని బాగా ఎంజాయ్ చేస్తుంటుంది.

రీసెంట్ గా సముద్రం మధ్యన దిగిన ఒక ఫోటోని అమ్మడు నెటీజన్స్ తో షేర్ చేసుకుంది. గ్లామర్ గర్ల్ గా తెరపై ఎన్ని సార్లు కనిపించి కుర్రకారును ఆకట్టుకుంటున్న ఈ బ్యూటీ బయట కూడా అదే తరహాలో కనిపిస్తూ మతి పోగొడుతోంది. బ్లాక్ బికినిలో ఆమె ప్రజెంట్ చేసిన అందాలు ఇచ్చిన స్టిల్ పై అభిమానుకు పాజిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు. గాగుల్స్ పెట్టుకొని ఇచ్చిన స్టిల్ బావుందంటూ ప్రశంసలు అందిస్తున్నారు.

ఇక అమీ జాక్సన్ ప్రస్తుతం ఒక హాలీవుడ్ వెబ్ సిరీస్ తో బిజిగా ఉంది. అలాగే కన్నడ సినిమా కూడా చిత్రీకరణ దశలో ఉంది. అలాగే 2.0 లాంటి ప్రతిష్టాత్మక చిత్రం రిలీజ్ కు రెడీగా ఉంది. మరికొన్ని బాలీవుడ్ సినిమాలు కూడా అమీ చేతిలో ఉన్నట్లు తెలుస్తోంది.