Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: అమీ.. ఫ్లాట్ అవ్వాల్సిందే

By:  Tupaki Desk   |   11 Nov 2017 3:07 PM GMT
ఫోటో స్టోరి: అమీ.. ఫ్లాట్ అవ్వాల్సిందే
X
హాట్ హాట్ ఫోటో షూట్స్ చేయడంలో అందాల మోత మోగించడంలో బ్రిటన్ బ్యూటీ అమీ జాక్సన్ తర్వాతే ఎవరైనా అని చెప్పాలి. అసలే ఇంగ్లీష్ అందం.. దానికి తోడు ఇప్పుడు టాప్ గేర్ లో ఉన్న బ్యూటీ.. అందుకే సోయగాల మెరుపుల విషయంలో అమీ జాక్సన్ ఓ రేంజ్ లో సందడి చేసేస్తోంది.

తన లేటెస్ట్ ఫోటో షూట్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ భామ.. ఇంటర్నెట్ ను వేడెక్కెంచేసింది. డెనిమ్ జీన్స్ ప్యాంట్ జేబుల్లో చేతులు ఉంచి పోజు ఇవ్వడం వరకు ఓకే కానీ.. ఆ పైనే అసలు విషయం అంతా దాగుంది. గార్మెంట్స్ మినహాయిస్తే.. టాప్ అసలు ఏమాత్రం లేకుండా ఈ బ్యూటీ ఇచ్చిన పోజుకు ఎవరికైనా మతి పోవాల్సిందే. ఈ రేంజ్ ఎక్స్ పోజింగ్ తో చాలామంది భామలే డ్రెసింగ్ చేసుకుని పోజులు ఇస్తారు కానీ.. అమ్మడి కళ్లలో కనిపిస్తున్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ మాత్రం ఏ ఒక్కరి వల్లా కాదు. ముఖ్యంగా తలను ఓ వారగా వంచి.. కొంచెం పెదాలను విప్పార్చి.. అమీ జాక్సన్ ఇచ్చిన పోజుకు అందరూ ఫ్లాట్ అవాల్సిందే.

ప్రస్తుతం రోబో సీక్వెల్ 2.ఓ మూవీలో తన పోర్షన్ షూటింగ్ ను ఫినిష్ చేసుకున్న ఈ భామ.. ఆ మూవీ రిలీజ్ కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తోంది. మరోవైపు.. పర్సనల్ గా కూడా తనలో బోలెడు ఛేంజ్ వచ్చేస్తోందని చెప్పకనే చెబుతున్న అమీ జాక్సన్.. ఆర్గానిక్ ఫామింగ్ చేపడుతున్నానని.. ఆరోగ్యంపై బోలెడంత శ్రద్ధ పెట్టేస్తోంది. కాకపోతే.. ఈ ఫామింగ్ ఇండియాలో కాదు.. లండన్ లో ఇలా సేంద్రీయ వ్యవసాయం చేస్తుందట అమీ.