Begin typing your search above and press return to search.

బన్నీకి జోడీగా లండన్ భామ??

By:  Tupaki Desk   |   3 March 2016 11:37 AM GMT
బన్నీకి జోడీగా లండన్ భామ??
X
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మూవీ ఎవడులో ఓ హీరోయిన్ గా నటించింది అమీజాక్సన్. ఆ తర్వాత ఈ సుందరాంగి వేరే భాషల్లో బాగా బిజీ అయిపోయినా.. టాలీవుడ్ లో మాత్రం ఏ సినిమా చేయలేదు. ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన రోబో సీక్వెల్ 2.0 చేస్తున్న అమీ.. త్వరలో స్టైలిష్ స్టార్ అమీజాక్సన్ సరసన నటించనుందని తెలుస్తోంది. లండన్ బ్యూటీ అమీ జాక్సన్ ను కొంత కాలం క్రితమే గీతా ఆర్ట్స్ సంస్థ సంప్రదించింది.

విక్రమ్ కె కుమార్ డైరెక్షన్ లో.. అల్లు అర్జున్ తో తీయనున్న సినిమాలో హీరోయిన్ గా నటించేందుకు ఈ సుందరాంగిని అడిగారు. ఆమె కూడా ఒప్పేసుకుంది. నిజానికి ఈ మూవీ ఈ ఏడాది మే నెల నుంచే షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ప్రస్తుతం చేతిలో ఉన్న ప్రాజెక్ట్ పూర్తి కాకపోవడంతో.. దర్శకుడు విక్రమ్ కుమార్.. చెప్పిన డేట్ కి బన్నీ సినిమాని స్టార్ట్ చేసే అవకాశం లేదు. ఈ ఏడాది నవంబర్ నుంచి ఈ కాంబినేషన్ పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి. అయితే.. ఈ లోపుగా లింగుస్వామి దర్శకత్వంలో ఓ బై లింగ్యువల్ మూవీ కంప్లీట్ చేసేయాలని గీతాఆర్ట్స్ భావించింది. దీనికి సంబంధించిన మాటలు కూడా దాదాపు పూర్తి కావచ్చాయి.

ఇప్పుడు గతంలో తీసుకున్న అమీ జాక్సన్ డేట్స్ ను బన్నీ-లింగుస్వామి మూవీకి ఉపయోగించుకోవాలని భావించి, ఆ మేరకు అమీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆమె కూడా ఓకే చేసేయడంతో.. ఇక బన్నీ-అమీల జంట రొమాన్స్ కి రెడీ అవుతున్నట్లే.