Begin typing your search above and press return to search.

అమీని చాలా కష్ట పెట్టాడుగా..

By:  Tupaki Desk   |   27 Nov 2018 5:52 AM GMT
అమీని చాలా కష్ట పెట్టాడుగా..
X
శంకర్‌ సినిమాల్లో హీరోయిన్స్‌ పాత్రలకు కథలో కీలక ప్రాధాన్యత ఉంటుందనే విషయం తెల్సిందే. కథలో భాగమైనప్పుడు మాత్రమే హీరోయిన్స్‌ వారి ప్రతిభను కనబర్చగలరు. ప్రాముఖ్యత లేని పాత్ర దక్కితే ఎంత మంచి హీరోయిన్‌ అయినా నిరుత్సాహ పర్చాల్సిందే. అయితే దర్శకుడు శంకర్‌ తాజాగా తన 2.ఓ చిత్రం కోసం అమీ జాక్సన్‌ ను చాలా కష్టపెట్టాడట. హీరోల తరహాలో యాక్షన్‌ సీన్స్‌ ను చేయించాడట. కేవలం హీరోలు మాత్రమే చేసేందుకు సాహసించే రోప్‌ యాక్షన్‌ సీన్స్‌ ను కూడా అమీ జాక్సన్‌ తో దర్శకుడు శంకర్‌ చేయించినట్లుగా తెలుస్తోంది.

అమీ జాక్సన్‌ తాజాగా సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో ఒక మేకింగ్‌ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. ఆ వీడియో సినీ వర్గాల వారిని ఆకట్టుకుంటుంది. సినిమా ప్రారంభం కాకముందు ఇలా యాక్షన్‌ సీన్స్‌ ను ప్రాక్టీస్‌ చేసినట్లుగా అమీ జాక్సన్‌ సోషల్‌ మీడియాలో పేర్కొంది. అత్యంత కష్టమైన రోబో సూట్‌ ను ధరించి రోప్స్‌ తో యాక్షన్‌ సీన్స్‌ లో అమీ జాక్సన్‌ నటించిందట. రజినీకాంత్‌ - అక్షయ్‌ కుమార్‌ లకు ఏమాత్రం తగ్గకుండా అమీ జాక్సన్‌ పాత్ర ఉంటుందని తమిళ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

600 కోట్ల బడ్జెట్‌ తో రూపొందిన ‘2.ఓ’ చిత్రం ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కాబోతున్న ఈ చిత్రం బాహుబలి రికార్డులను కేవలం రెండు వారాల్లోనే తూడ్చి పెట్టేస్తుందని తమిళ ట్రేడ్‌ వర్గాల వారు చాలా నమ్మకంగా ఉన్నారు. సినిమాకు సంబంధించిన ప్రతి ఒక్క అంశం కూడా సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది.