Begin typing your search above and press return to search.
అమీ అలా ఎంజాయ్ చేస్తోంది
By: Tupaki Desk | 1 Jun 2018 8:19 AM GMTబ్రిటన్ నుంచి ఇండియాకి దిగుమతి అయిన అందం అమీ జాక్సన్. విదేశీ అందమే అయినా ఇండియన్ లాగే కనిపించడం అమీకి కలిసొచ్చిన అంశం. అందుకే కోలీవుడ్ ఆమెకు స్వాగతం పలికేసింది. వరస క్రేజీ ప్రాజెక్టులతో పాపులరయిన ఈ అందాల భామ తక్కువ కాలంలోనే ఏకంగా సూపర్ స్టార్ రజనీకాంత్ పక్కన నటించే ఛాన్స్ పట్టేసింది.
ఈమధ్య షూటింగులకు కాస్త గ్యాప్ ఇచ్చిన అమీ జాక్సన్ ఫారిన్ టూర్ కు బయలుదేరి వెళ్లింది. వాళ్ల నాన్న బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం రోమ్ వెళ్లిన ఈ గ్లామర్ డాల్ వెకేషన్ ను బాగానే ఎంజాయ్ చేస్తోంది. తన టూర్ కు సంబంధించిన అప్ డేట్స్ ను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పెడుతూ అభిమానులకు టచ్ లోనే ఉంది. తాజాగా రోమ్ లో పిజ్జా తింటూ ఓ సూపర్ ఫోజిచ్చింది. తొడల అందాలు ప్రదర్శిస్తూ ఈ సెక్సీ భామ షేర్ చేసిన ఈ ఫొటో చూస్తే చాలు.. క్రేజీ ప్రాజెక్టులన్నింటిలో అమీ హీరోయిన్ గా ఎందుకు సెలక్ట్ అవుతుందో ఇట్టే తెలిసిపోతుంది.
ప్రస్తుతం అమీ జాక్సన్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న 2.0 సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. రూ. 400 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.