Begin typing your search above and press return to search.

వాళ్లిద్దరూ ప్రేమపక్షులు 'ఐ'పోయారట

By:  Tupaki Desk   |   12 Sep 2016 7:30 AM GMT
వాళ్లిద్దరూ ప్రేమపక్షులు ఐపోయారట
X
బాలీవుడ్ లో బ్రేకప్ లు ఎంత స్పీడ్ గా ఉంటాయో.. కొత్త లవ్ స్టోరీల పుట్టుక కూడా అలాగే ఉంటుంది. ఎన్ని బ్రేకప్ కహానీలు వినిపించినా.. కొత్తవాటికి మాత్రం బ్రేక్ పడదు. ఇప్పుడు బాలీవుడ్ కి లేటెస్ట్ ప్రేమజంట ఎవరో తెలుసా? బ్రిటిష్ బ్యూటీ అమీ జాక్సన్- బాలీవుడ్ యాక్టర్ ఉపేన్ పటేల్.

ఐ మూవీలో అమీ జాక్సన్ హీరోయిన్ అయితే.. విలన్స్ లో ఒకడిగా నటించాడు ఉపేన్. అప్పటి నుంచి వీరిద్దరి మధ్యా ఉన్న పరిచయం.. ఈ మధ్యనే ప్రేమగా అప్ గ్రేడ్ అయినట్లు చెప్పుకుంటున్నారు. ఈ మధ్య కాలంలోనే వరుసగా రెస్టారెంట్స్ లో జంటగా ఈ జంట పక్షులు దర్శనమిచ్చేస్తున్నాడు. వీళ్ల లవ్ లీ డిన్నర్ కి సంబంధించిన ఫోటోలు కూడా నెట్ లో చక్కర్లు కొట్టేస్తున్నాయి. ఇలాంటి వాటిని తామేం పట్టించుకోం అన్నట్లుగా బిహేవ్ చేసేందుకు అమీ జాక్సన్- ఉపేన్ పటేల్ లు బాగానే ట్రై చేస్తున్నారు.

ఉపేన్ పటేల్ రీసెంట్ గానే తన లవర్ కరష్మా తన్నాకు బ్రేకప్ చెప్పేసి.. కొత్త బ్యూటీని సెలెక్ట్ చేసుకున్నాడనే టాక్ వినిపిస్తోంది. అయితే.. అమీ జాక్సన్ మాత్రం ఇలాంటివాటికి ఏమాత్రం రెస్పాండ్ కాకుండా తన పని తాను చేసుకుపోతోంది. మరి ఈ కొత్త జంట ప్రేమ ఎక్కడివరకూ వెళ్తుందో!