Begin typing your search above and press return to search.
నేనా.. రోబోనా.. అంటున్న అమీ!
By: Tupaki Desk | 27 Feb 2016 11:30 AM GMTలండన్ అందాల భామ అమీ జాక్సన్.. ఇప్పుడు దేశీయ సినీరంగంలో బాగానే సత్తా చాటుతోంది. ఇప్పటికే టాప్ డైరెక్టర్ శంకర్ తో ఒక సినిమాలో చేసిన అమీ.. మరోసారి ఆయన డైరెక్షన్ లో నటిస్తోంది. రోబో సీక్వెల్ గా తెరకెక్కుతున్న 2.0లో అమీ జాక్సన్ లీడ్ రోల్ చేస్తోంది. 2.0లో అమీ పాత్ర కూడా ఒక రోబో అనే ప్రచారం జరుగుతోంది. అయితే.. తొలిసారిగా ఈ మూవీకి సంబంధించిన ఒక అప్ డేట్ ను ఈ భామ బయటపెట్టింది.
రజినీకాంత్ తో కలిసి నటిస్తున్న రోబో సీక్వెల్ లో తన పాత్ర ఒక రోబోట్ అనే ప్రచారాన్ని ఖండించింది. ఎలాంటి రోల్ చేస్తోందో ఇప్పుడే ఏమీ చెప్పలేనని.. అయితే అది ఖచ్చితంగా రోబో కేరక్టర్ మాత్రం కాదని తేల్చేసింది ఈ సుందరి. రజినీకాంత్ - అక్షయ్ కుమార్ లతో కలిసి నటించడం చాలా హ్యాపీగా ఉందని.. అది కూడా శంకర్ లాంటి గ్రేట్ డైరెక్టర్ తో రెండోసారి కలిసి పని చేసే అవకాశం రావడం తన అదృష్టం అని తెగ మురిసిపోతోంది ఈ భామ. ప్రస్తుతం ఈ సుందరాంగి కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సరసన నటించిన తెరి చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది.
ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమాల్లోనే.. ఇలా రోబోకి సంబంధించిన సంగతులను అభిమానులతో పంచుకుంది. మొత్తానికి అమ్మడి వెర్షన్ ప్రకారం ఇప్పుడీమె కేరక్టర్ రోబో కాదని తేలిపోయింది. అంటే ఖచ్చితంగా రజినీకాంత్ కి జంటగా నటించే హీరోయిన్ రోల్ అని తమిళ జనాలు చెప్పుకుంటున్నారు.