Begin typing your search above and press return to search.

రోబో చిట్టి క‌న్న‌య్య 2.0 అరైవ్డ్

By:  Tupaki Desk   |   23 Sep 2019 12:16 PM GMT
రోబో చిట్టి క‌న్న‌య్య 2.0 అరైవ్డ్
X
ఎమీజాక్స్‌న్.. తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అక్క‌ర‌లేని పేరిది. తెలుగు- త‌మిళ భాష‌ల్లో క్రేజీ చిత్రాల్లో న‌టించి మంచి గుర్తింపును సొంతం చేసుకున్న ఈ బ్యూటీ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఐ.. 2.ఓ చిత్రాల్లో న‌టించింది. మ‌ల్టీమిలియ‌నీర్‌ జార్జ్ ప‌నాయాతో డేటింగ్ చేసిన ఎమీ పెళ్లి కాకుండానే లివ్ ఇన్ రిలేష‌న్ షిప్ లో గ‌ర్భం దాల్చిన సంగ‌తి విదిత‌మే.

మాతృత్వ ఘ‌డియ‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్నాయి అంటూ ఇటీవ‌ల‌ సోష‌ల్ మీడియాలో ఫొటోల‌ని పోస్ట్ చేస్తూ అలెర్ట్ చేసిన‌ ఈ ముద్దుగుమ్మ ఈ రోజు పండంటి మ‌గ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. పుట్టిన బాబుకి అప్పుడే పేరు కూడా పెట్టేసింది. బాల‌కుడి పేరు ఆండ్రియాస్‌. త‌న‌కు కొడుకు పుట్టాడ‌న్న వార్త‌ని ఎమీజాక్స‌న్ త‌న అభిమానుల‌తో పంచుకుంది.

చిట్టి క‌న్న‌య్య 2.0కు సంబంధించిన ఫొటోల‌ని ఇన్ స్టాలో పోస్ట్ చేసిన అమీ `మై డియ‌ర్ ఏంజెల్.. ఈ ప్ర‌పంచంలోకి నీకు స్వాగ‌తం` అని క్యాప్ష‌న్ ఇచ్చింది. ఎమీ పోస్ట్ చేసిన ఫొటోలో భ‌ర్త జార్జ్ త‌న‌ నుదుటిపై ముద్దు పెడుతుండ‌గా చిన్నారిని ఎద‌కు హ‌త్తుకుంటూ క‌నిపించింది. జాంబియాకు చెందిన మ‌ల్టీమిలియ‌నీర్ జార్జ్ తో జ‌న‌వ‌రి 1న ఎంగేజ్ అయ్యాన‌ని.. అప్పుడే త‌ను న‌న్ను ప్ర‌పోజ్ చేశాడ‌ని తెలిపింది. ఆ రోజు అత‌నితో గ‌డిపిన సాయంత్రం మ‌ధురానుభూత‌ని క‌లిగించింద‌ని అమీ జాక్స‌న్ ఓ ప్రైవేట్ మ్యాగ‌జైన్ తో పంచుకుంది. పిల్ల‌లు కావాల‌ని ప్లాన్ చేసుకోలేద‌ని అనుకోకుండా అలా జ‌రిగిపోయింద‌ని ఊహించ‌కుండానే బాబు పుట్ట‌డం ఆనందంగా వుందని వెల్ల‌డించింది. అమీ- జార్జ్‌ల వివాహం వ‌చ్చే ఏడాది గ్రీస్ లో జ‌ర‌గ‌నుంది.