Begin typing your search above and press return to search.

బిడ్డ‌ను క‌న్నాక కొత్త ప్రియుడితో కాపురం?

By:  Tupaki Desk   |   7 July 2022 11:30 AM GMT
బిడ్డ‌ను క‌న్నాక కొత్త ప్రియుడితో కాపురం?
X
ప్ర‌పంచంలోనే అత్యంత ధ‌నికుడైన యువ‌కుడితో ఎఫైర్ సాగించిన అందాల క‌థానాయిక ఇటీవ‌లే అత‌డితో ఒక బిడ్డ‌కు స్వాగ‌తం ప‌లికింది. వార‌సుడిని అల్లారు ముద్దుగా పెంచుకుంటోంది. త్వ‌ర‌లోనే ఈ జంట వివాహం జ‌రుగుతుంద‌ని భావించారు అభిమానులు. దానిపై అంత‌ర్జాతీయ మీడియాలోనూ పెద్ద ఎత్తున క‌థ‌నాలొచ్చాయి. కానీ అది నిజం కాలేదు. ఇంత‌లోనే ఈ జంట అన్యోన్య‌త‌లో మార్పులొచ్చాయి.

ప్ర‌స్తుతం ఆ ఇద్ద‌రూ ఎవ‌రికి వారే య‌మునా తీరే అన్న‌ట్టుగా ఉన్నారు. ఒక‌రి నుంచి ఒక‌రు విడిపోయారు. అత‌డు ఇప్పుడు మాజీ. త‌న‌యుడితో ఆమె ఒంట‌రిగానే ఉంటోంది. కానీ ఇంత‌లోనే మ‌రో కొత్త ప్రేమికుడు త‌న జీవితంలోకి ప్ర‌వేశించాడు. అత‌డితో బ‌హిరంగంగానే ఇప్పుడు చెట్టాప‌ట్టాల్ అంటూ తిరిగేస్తోంది. ఇదంతా ఎవ‌రి గురించో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన ప‌నే లేదు. సౌత్ నార్త్ అనే తేడా లేకుండా భార‌త‌దేశంలో అంద‌రి హృద‌యాల‌ను గెలుచుకున్న బ్రిటీష్ బ్యూటీ ఎమీ జాక్స‌న్ గురించే.

బ్రిటన్ కి చెందిన బిలియ‌నీర్ జార్జ్ ప‌నాయ‌టౌతో రెండేళ్లుగా ప్రేమాయ‌ణం న‌డిపించిన ఈ బ్యూటీ అత‌డికి వార‌సుడిని కానుక‌గా అందించింది. కానీ ఇంత‌లోనే మ‌న‌స్ఫ‌ర్థ‌ల‌తో ఈ జంట విడిపోయారు. ఇంత‌కుముందే ఎమీజాక్స‌న్ ఓ పార్టీలో కొత్త ప్రియుడు ఎడ్ వెస్ట్ విక్ తో షికార్ చేస్తున్న ఫోటోలు వైర‌ల్ అయ్యాయి. తాజాగా ఈ బంధాన్ని ఎమీజాక్స‌న్ అధికారికం చేసింది.

నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ 2022 వేడుక‌లో బాయ్‌ఫ్రెండ్ ఎడ్ వెస్ట్ విక్ తో చేతులు కలిపి క్యాట్ వాక్ చేసింది. ఈ వేదిక‌పై అమీ జాక్సన్ బ్లాక్ డ్రెస్ లో ఎంతో హాట్ గా కనిపించింది. ఆ ఇద్ద‌రి వాల‌కం చూశాక ఇక అధికారికం అంటూ క‌థ‌నాలు వైర‌ల్ అవుతున్నాయి.

చాలా కాలంగా కొత్త స్నేహితుడిపై రూమ‌ర్స్

భారతదేశంలో జన్మించిన బ్రిటీష్ నటి అమీ జాక్సన్.. `గాసిప్ గర్ల్` మూవీలో త‌న పాత్ర‌తో పాపుల‌రైన ఎడ్ వెస్ట్ విక్ తో రొమాన్స్ ఎఫైర్ గురించి చాలా కాలంగా పుకార్లు ఉన్నాయి. కొన్ని రోజుల క్రితం ఆమె కొన్ని సన్నిహితుడితో ఉన్న ఫోటోలను పంచుకుని ఎడ్ తో తన ప్రేమను ధృవీకరించింది. మరోసారి 2022 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ కోసం ఇంగ్లాండ్‌-లండన్ లోని పోర్చెస్టర్ హాల్ లోకి ప్రవేశిస్తూ జంట‌గా క‌నిపించారు. అమీ జాక్సన్ ఈ ఈవెంట్ లో నెక్ లైన్ లేస్ ట్రిమ్ డ్రెస్.. మ్యాచింగ్ బ్లాక్ హీల్స్ .. రెడ్ హాట్ లిప్స్ తో అద్భుతమైన బ్లాక్ లుక్ లో కనిపించింది. గాసిప్ గర్ల్ నటుడు ఎడ్ విక్ సాంప్రదాయ బ్లాక్ టక్సేడో ధరించి కార్యక్రమానికి హాజరయ్యారు. రెడ్ కార్పెట్ పై కొత్త జంట రొమాంటిక్ గా క‌నిపించారు.

వృత్తిపరంగా చూస్తే అమీ 2010 తమిళ చిత్రం `మద్రాసిపట్టణం`తో తన తెరంగేట్రం చేసింది. తమిళ చిత్రాలే కాకుండా హిందీ -తెలుగు- కన్నడ చిత్రాలలో నటించింది. ఆమె చివరిసారిగా రజనీకాంత్ తో 2.0 చిత్రంలో కనిపించింది. అయితే ఎడ్ వెస్ట్ విక్ టెలివిజన్ ధారావాహిక `గాసిప్ గర్ల్‌`లో చక్ బాస్ పాత్ర తో పాపుల‌ర‌య్యాడు. ఎడ్ విక్ చివరిగా `మి యు మ్యాడ్ నెస్` అనే సినిమాలో కనిపించాడు.