Begin typing your search above and press return to search.

బిట్రీష్‌ సుందరికి అలవాటైపోయిందట

By:  Tupaki Desk   |   29 July 2017 11:15 AM IST
బిట్రీష్‌ సుందరికి అలవాటైపోయిందట
X
మన దేశంలో ఉన్న హీరోయిన్లు మాత్రమే కాదు మన సినిమాలులలో హీరోయిన్ గా చేస్తున్నది. పక్క దేశం ఆయన పాకిస్తాన్ - శ్రీలంక దేశాల సుందరాలు కూడా వచ్చి మన దేశంలో హీరోయిన్ అయి పాపులర్ అయినవారు ఉన్నారు. అలాగే పక్క దేశం నుండే కాదు బ్రిటిష్ దేశం నుండి కూడా వచ్చి ఇక్కడ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న మోడల్ హీరోయిన్ ఆమీ జాక్సన్ కూడా ఉంది.

ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడిన ఆమీ.. తను చేసిన చాలా సినిమాలు ఫ్లాపుల అవ్వడంపై ఆమెను ఒక వైట్ గాళ్‌ గా పక్కన పెట్టడంపై ఇంకా వస్తున్న ఇతర విమర్శలకు ఇలా స్పందించింది. ''జాతి వివక్షత అనేది నటులు మాత్రమే ఎదుర్కుంటున్న సమస్య కాదు ప్రపంచం మొత్తం ఈ సమస్య పై కొన్ని శతాబ్ధాలుగా పోరాడుతుంది. నా పై సోషల్ మీడియాలో వివక్షత చూపిస్తున్నారు కాని నా నిజ జీవితంలో నేను ఎప్పుడు అటువంటి అనుభవానికి గురికాలేదు. నేను మొదటిసారి మోడలింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు నన్ను చాలామంది రిజెక్ట్ చేశారు. అప్పుడు చాలా భాద పడేదాన్ని కాని సినిమాలలో పని చేస్తున్నప్పుడు నుంచి నేను పూర్తిగా మారిపోయాను. అంటే ఈ బాధలన్నీ అలవాటైపోయాయ్. ఆడిషన్ చేసినా కూడా ఛాన్సు ఇవ్వాలన్న రూల్ లేదు. కాబట్టి నేను ఇప్పుడు ధృడంగా తయారయ్యాను'' అంటోంది ఆమీ.

ఇప్పుడు చేస్తున్న 2.0 సినిమా వలన కొన్ని పెద్ద ప్రాజెక్టులు వదలుకుందట. కాని శంకర్ డైరక్షన్లో పని చేయడం ఇద్దరి సూపర్ స్టార్ తో పని చేయడం చాలా ఆనందంగా ఉందట. కాకపోతే సౌత్ ఇండియా సినిమాలు చేయడం వలన కొన్ని పాత్రలకే పరిమతం చేయడం జరుగుతుందది.. బాలీవుడ్ లో అయితే వివిధ రకాల పాత్రలు పోషించే ఛాన్సుంటుంది అంటూ సెలవిచ్చింది. రజనీ 2.0 కాకుండా.. ‘ది విలన్’ మరియు ‘బూగీమాన్’ అనే ఇంగ్లిష్ సినిమాలో కూడా నటిస్తుంది. ”