Begin typing your search above and press return to search.

పుష్ప‌రాజ్ ని ఖూనీ చేస్తూ ఏంటీ ప్ర‌చారం?

By:  Tupaki Desk   |   18 Jan 2022 3:55 AM GMT
పుష్ప‌రాజ్ ని ఖూనీ చేస్తూ ఏంటీ ప్ర‌చారం?
X
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన‌ `పుష్ప: ది రైజ్` చిత్రం దేశవ్యాప్తంగా విడుద‌లై సంచ‌ల‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. తెలుగు-త‌మిళం-మ‌ల‌యాళం-క‌న్న‌డం-హిందీ భాష‌ల్లో విడుద‌లైంది. క‌రోనా మ‌హమ్మారీ క్రైసిస్ లో విడుద‌లైనా కానీ.. కేజీఎఫ్ ని మించిన విజ‌యం అందుకుంది. అంత‌కుమించి ఈ సినిమాలో న‌టించిన అల్లు అర్జున్ వార్త‌ల్లో వ్య‌క్తి అయ్యారు. హిందీ బెల్ట్ లో విజ‌యం నేప‌థ్యంలో జాతీయ ప‌త్రిక‌ల హెడ్ లైన్స్ లో చర్చనీయాంశంగా మారారు. పుష్ప రాజ్ గా అత‌డి అస‌మాన న‌ట‌న‌కు ప్ర‌శంసించ‌ని ప్ర‌ముఖులు లేరు. ఇక ఇదే అద‌నుగా ఇప్పుడు మ‌రోసారి అమూల్ టాపిక్ వేడెక్కిస్తోంది. ఇప్పుడు ఈ సినిమాకు అమూల్ ఇండియా కూడా ఝలక్ ఇచ్చింది.

అల్లు అర్జున్ పుష్ప లుక్ ని.. రష్మిక మందన్న శ్రీవల్లి లుక్ ని అలాగే.. ఫహద్ ఫాసిల్ లుక్ ని ఆవిష్క‌రిస్తూ ఉన్న ఒక‌ కార్టూన్ ను అమూల్ త‌మ‌ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ``కొంత అముల్లు.. అర్జున్!`` అంటూ ప్ర‌చారానికి ఉప‌యోగించుకోవ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. వారు దానికి ఇచ్చిన‌ క్యాప్షన్ ఆస‌క్తిక‌రం. ``#అమూల్ టాపికల్: కొత్త యాక్షన్-డ్రామా చిత్రం భారీ హిట్``.. అల్లు అర్జున్ కూడా ``అల్లు టు మల్లు టు అమ్ములు అర్జున్`` అని వ్యాఖ్యను జోడించారు. వారి అమూల్ టాపికల్ హ్యాష్ ట్యాగ్ కింద అత్యధిక ట్రెండింగ్ టాపిక్ అయిన‌ కార్టూన్ లను పంచుకున్నారు. అందుకే అమూల్ బ్రాండ్ టైమింగ్ లీ పుష్ప కార్టూన్ ని వినియోగిస్తూ ప్ర‌చారం చేసుకోవ‌డం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఫుడ్ ప్రాసెసింగ్ బిజినెస్ లో 70ఏళ్ల చ‌రిత్ర క‌లిగిన అమూల్ కి గుజ‌రాత్ హెడ్ క్వార్ట‌ర్ అన్న సంగ‌తి తెలిసిందే. అమూల్ మిల్క్ ఫుడ్స్ కి ఇటీవ‌ల‌ ఏపీలోనూ గిరాకీ పెంచే ప్ర‌య‌త్నం చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

అల్లు అర్జున్-ర‌ష్మిక‌- ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రల్లో నటించిన పాన్ ఇండియా యాక్షన్ డ్రామా చిత్రం-పుష్ప‌. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 300 CR వసూళ్లను సాధించి హిందీ బెల్ట్ లో థియేటర్ల‌లో ఇంకా బలంగా నడుస్తోంది. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. నవీన్ యెర్నేని - వై. రవిశంకర్ మైత్రి బ్యాన‌ర్ లో నిర్మించారు. ఈ చిత్రం ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం అవుతోంది.