Begin typing your search above and press return to search.

బాహుబలికి ‘అమూల్’యమైన గౌరవం

By:  Tupaki Desk   |   17 Oct 2015 5:53 AM GMT
బాహుబలికి ‘అమూల్’యమైన గౌరవం
X
నేషనల్ పేపర్స్ ను ఫాలో అయ్యేవాళ్లకు అమూల్ వాళ్ల యాడ్స్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యే అంశానికి సంబంధించి ఫన్నీగా, క్రియేటివ్ గా ఉండే యాడ్స్ తో పాఠకుల మనసు దోస్తుంటుంది ‘అమూల్’. ఐతే ఆ సంస్థ ఏ అంశానికి పడితే ఆ అంశానికి స్పందించదు. సందర్భం చాలా ప్రత్యేకమైందే అయ్యుండాలి. అందుకే ‘అమూల్’ యాడ్ టాపిక్ గా మారిన వాళ్లు దాన్నో పెద్ద గౌరవంగా భావిస్తారు. ఆ గౌరవం రెండోసారి దక్కించుకుంది ‘బాహుబలి’ టీమ్.

బాహుబలి వంద రోజుల ప్రదర్శన పూర్తవుతున్న సందర్భంగా తాజాగా ఓ ప్రకటన రూపొందించింది ‘అమూల్’. అవంతిక ‘అమూల్’ వాళ్ల బట్టర్ కేక్ ని బాహుబలికి ఇస్తున్నట్లు ప్రకటన తయారు చేసి దానికి ‘బహుత్ బటర్లి’ అనే క్యాప్షన్ జోడించింది. బ్యాగ్రౌండ్ లో భల్లాలదేవుడిని కూడా పెట్టింది. కింద ‘అమూల్’ మాసివ్ హిట్ అని తన క్యాప్షన్ ఇచ్చుకుంది. దీని ద్వారా తనకు తాను ప్రచారం చేసుకోవడమే కాదు.. బాహుబలి సినిమాకు కూడా మంచి ప్రచారం తెచ్చిపెట్టింది.

ఇంతకుముందు బాహుబలి విడుదలైన కొత్తలోనూ ఈ సినిమా భారతీయ చలనచిత్ర రికార్డుల్ని కొల్లగొట్టడంపై ఓ కార్టూన్ యాడ్ వేసింది అమూల్. అప్పట్లో అదో పెద్ద సంచలనమైంది. ఇప్పుడు తాజా కార్టూన్ యాడ్ కూడా మన ‘బాహుబలి’కే కాదు, తెలుగు సినిమాకు దక్కిన మరో ‘అమూల్’యమైన గౌరవంగా భావించాలి.