Begin typing your search above and press return to search.

ప్రదీప్‌ హీరోయిన్ సమంత ఫ్యాన్‌

By:  Tupaki Desk   |   12 Sep 2020 1:30 AM GMT
ప్రదీప్‌ హీరోయిన్ సమంత ఫ్యాన్‌
X
ప్రదీప్‌ హీరోగా రూపొందిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ఆ సినిమా సమ్మర్‌ లో విడుదల అవ్వాల్సి ఉన్నా కూడా కరోనా కారణంగా నిలిచి పోయింది. బుల్లి తెరపై ప్రదీప్‌ కు ఉన్న క్రేజ్‌ కారణంగా సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక సినిమాలోనే నీలి నీలి ఆకాశం సాంగ్‌ సెన్షేషనల్‌ సక్సెస్‌ అయ్యింది. దాంతో ప్రదీప్‌ సరసన నటించిన అమృత అయ్యర్‌ కూడా బాగా ఫేమస్‌ అయ్యింది. సోషల్‌ మీడియాలో ఆమెకు ఏకంగా 1 మిలియన్‌ ఫాలోవర్స్‌ ఉన్నారు. తన ఫాలోవర్స్‌ తో ఇటీవల ఆమె చిట్‌ చాట్‌ చేసింది.

ఏదైనా ప్రశ్నలు అడగండి అంటూ అమృత అయ్యర్‌ చాట్‌ షెషన్‌ మొదలు పెట్టింది. పలువురు పలు రకాల ప్రశ్నలను సంధించారు. వాటిలో కొన్నింటికి ఆమె సమాధానం చెప్పింది. ఒక తెలుగు అభిమాని మీకు టాలీవుడ్‌ లో ఇష్టమైన హీరోయిన్‌ ఎవరు అంటూ ప్రశ్నించగా తనకు సమంత అంటే చాలా ఇష్టం అంటూ అమృత చెప్పింది. ఆమె సినిమాల పరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఆమె అంటే అభిమానం అంది.

ఆమె గ్రీన్‌ ఛాలెంజ్‌ మరియు ఆమె చేసే సేవా కార్యక్రమాలు తనకు ఆదర్శం అంటూ అమృత పేర్కొంది. ఈమె 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా తర్వాత టాలీవుడ్‌ లో బిజీ అవ్వడం ఖాయం అని.. ఈమెకు స్టార్‌ హీరోయిన్‌ గా పేరు తెచ్చుకునే ఫీచర్స్‌ కూడా ఉన్నాయంటూ నెటిజన్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.