Begin typing your search above and press return to search.

మాజీ వైఫ్.. గొడవ సంగతి చెప్పేసింది

By:  Tupaki Desk   |   4 Oct 2016 5:44 AM GMT
మాజీ వైఫ్.. గొడవ సంగతి చెప్పేసింది
X
బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ లు డిసెంబర్ లో ఓ బిడ్డకు జన్మనివ్వనున్న సంగతి తెలిసిందే. భర్త సైఫ్ అలీ ఖాన్ కూడా ఈ విషయంపై ఫుల్లు హ్యాపీగా ఉన్నాడు. కానీ కొన్ని రోజులుగా సైఫ్ మాజీ భార్య అమృతా సింగ్- కరీనా కపూర్ లపై కొన్ని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. వీళ్లిద్దరికీ మధ్య పెద్ద యుద్ధమే జరిగిందన్నది వాటి సారాంశం.

సైఫ్- అమృతాల కూతురు సారా ఆలీ ఖాన్ విషయంలో.. బెబోకి అమృత చీవాట్లు పెట్టిందని.. కరీనా కపూర్ కూడా ఏం తగ్గలేదనే న్యూస్ వచ్చింది. ఓ ఈవెంట్లో అందాలు ఆరబోస్తూ సారా డ్రసింగ్ చేసుకోవడానికి కారణం కరీనానే అని భావించి.. అమృత గొడవ పడినట్లుగా న్యూస్ హల్ చల్ చేశాయి. అయితే.. ఓ ఇంటర్వ్యూలో అసలు విషయం చెప్పేసింది సైఫ్ మాజీ వైఫ్. 'ఈ మధ్య కాలంలో చాలామంది నా పేరును అనవసరంగా ఉపయోగించుకుంటున్నారు. ఈ కాలం పిల్లలకు వారి సొంత మైండ్ సెట్ ఉంది. నా కూతురు సారా.. కొడుకు ఇబ్రహీంలు.. నా మాదిరిగా కాకుండా వాళ్లను వాళ్లే లీడ్ చేసుకోవాలన్నది నా ఆలోచన' అని చెప్పింది అమృతా సింగ్.

'యాక్టింగ్ నేర్చుకునే ముందు చదువు పూర్తి చేయాలని సారా నిర్ణయించుకుంది. కొలంబియా యూనివర్సిటీలో స్టడీస్ పూర్తయ్యాకే బాలీవుడ్ పై దృష్టి పెట్టింది. కాలేజ్ వెళ్లకూడదని అనుకుంటే నేనేం చేయగలిగేదాన్ని' అంటూ అమృతా సింగ్ అనడంతో.. బెబో-అమృతల మధ్య వివాదం రూమర్ మాత్రమే అనే సంగతి తేలిపోయింది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/