Begin typing your search above and press return to search.

సైఫ్ పెళ్లి ఫోటో భలే వైరల్

By:  Tupaki Desk   |   26 Aug 2017 10:53 AM GMT
సైఫ్ పెళ్లి ఫోటో భలే వైరల్
X
సైఫ్ అలీ ఖాన్ పెళ్లి ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. ప్రస్తుతం సైఫ్ తన రెండో భార్య కరీనా కపూర్ తో ఉంటున్నాడు. ఈ బాలీవుడ్ హీరో మొదట అమృతా సింగ్ ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. సైఫ్-అమృతాల వివాహం 1991లో జరిగింది.

వీరిద్దరికి ఇద్దరు పిల్లలు ఉండగా.. 2004లో విడాకులు తీసుకున్నాడు సైఫ్. అయితే.. సడెన్ గా ఇప్పుడు 1991 నాటి సైఫ్ పెళ్లి ఫోటో వైరల్ గా మారింది. టీనేజ్ కుర్రాడి మాదిరిగా సైఫ్ ఈ ఫోటోలో కనిపిస్తుండగా.. పెద్ద రింగ్ లాంటి ముక్కు పుడకతో అమృతా సింగ్ కనిపిస్తుంది. ఇప్పుడీ ఫోటో వైరల్ గా మారడానికి కారణం.. ఈ ముక్క పుడకే అంటే ఆశ్చర్యం వేయకమానదు. ఈ రింగ్.. నా ఫ్రెండ్స్ సర్కిల్ కంటే పెద్దగా కనిపిస్తోంది అంటూ కామెంట్ చేసిన ఓ మహిళ.. ఈ ఫోటోను పోస్ట్ చేసింది.

అంతే అక్కడి నుంచి విపరీతంగా షేర్ అవడంతో పాటు.. నెట్ జనాలు తమ మైండ్ ఉపయోగిస్తూ.. బోలెడు రకాల కామెంట్స్ చేశారు. అమృతా సింగ్ ముక్కుకి ఉన్న రింగ్.. శని గ్రహం చుట్టూ ఉండే వలయాల కంటే పెద్దగా ఉన్నాయని ఒకరు కామెంట్ చేస్తే.. పెద్ద సైజు చపాతీలా ఉందంటూ మరొకరు కామెంట్ పెట్టారు. దీంతో ఇప్పుడు ఈ నోస్ రింగ్ పెద్ద కామెడీనే కాదు.. వైరల్ అండ్ ట్రెండింగ్ అయిపోయింది.