Begin typing your search above and press return to search.

బాలీవుడ్‌ లో సైనా నెహ్వాల్ బ‌యోపిక్

By:  Tupaki Desk   |   17 Dec 2015 4:12 AM GMT
బాలీవుడ్‌ లో సైనా నెహ్వాల్ బ‌యోపిక్
X
అథ్లెట్ మిల్కా సింగ్ ఆటో బ‌యోగ్ర‌ఫీ - భాగ్ మిల్కా భాగ్ పేరుతో - బాక్స‌ర్ మేరీకోమ్ జీవితం- మేరీకోమ్ పేరుతో వెండితెర‌కెక్కి ఘ‌న‌విజ‌యాలు సాధించిన సంగ‌తి తెలిసిందే. క్రీడాకారుల బ‌యోపిక్‌ లు అన్ని వేళ‌లా ప్రేక్ష‌కుల్ని ఇన్‌ స్ప‌యిర్ చేస్తాయ‌న‌డానికి ఈ సినిమాలే ఉదాహ‌ర‌ణ‌లు. ఇప్పుడు అదే బాట‌లో బ్యాడ్మింట‌ర్ క్రీడాకారిణి - వ‌ర‌ల్డ్ లీడింగ్ ప్లేయ‌ర్ సైనా నెహ్వాల్ జీవితాన్ని వెండితెర‌కెక్కించేందుకు స‌న్నాహాలు సాగుతున్నాయి.

జాతీయ స్థాయి ఉత్త‌మ‌ ద‌ర్శ‌కుడు అమోల్ గుప్తా అందుకు సన్నాహాలు మొద‌లెట్టారు. ఇటీవ‌లే ఆయ‌న హైద‌రాబాద్ విచ్చేసి సైనా కుటుంబ స‌భ్యుల్ని క‌లిశారు. త‌న‌కి సంబంధించిన అన్ని విష‌యాల‌పై ఆరా తీశారు. క‌థ రాసుకున్నారు. అనంత‌రం సైనా కుటుంబ స‌భ్యులు ఇచ్చిన ఆతిథ్యాన్ని స్వీక‌రించారు. ఆలు-ప‌రోటా రుచి చూసి మ‌రీ వెళ్లారు. ఇక సైనా జీవితాన్ని వెండితెర‌పై చూసుకోవాల‌న్న ఉత్సాహం అటు ఉత్త‌రాది ప్రేక్ష‌కులతో పాటు, ద‌క్షిణాది ప్రేక్ష‌కుల్లోనూ మొద‌లైన‌ట్టే. ఎందుకంటే ఓ సాధార‌ణ మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబం నుంచి ప్ర‌పంచ స్థాయికి ఎదిగిన క్రీడాకారిణి సైనా. అంచెలంచెలుగా ప్ర‌తిభ‌కు మెరుగులు దిద్దుకుని మొక్క‌వోని ధీక్ష‌తో ఇంతింతై వ‌టుడింతై అన్న చందంగా ఎదిగింది. అందుకే సైనా నెహ్వాల్ బ‌యోపిక్ అన‌గానే ఎంతో ఆస‌క్తి క‌లుగుతోంది.

ప్ర‌స్తుతం బాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ ఫ‌రాఖాన్.. ప‌రిణీతి చోప్రా నాయిక‌గా సానియా మీర్జా బ‌యోపిక్‌ ని తెరకెక్కించాలనే పనుల్లో బిజీగా ఉంది. ఇంత‌లోనే సైనా బ‌యోపిక్ పై కాన్‌ స‌న్‌ ట్రేష‌న్ పెట్ట‌డం ఎంతో ఇంట్రెస్టింగ్ క‌దూ?