Begin typing your search above and press return to search.

అమ్మడితో చిరు 'మేకింగ్' కుమ్ముడు

By:  Tupaki Desk   |   22 Dec 2016 4:30 AM GMT
అమ్మడితో చిరు మేకింగ్ కుమ్ముడు
X
మెగాస్టార్ చిరంజీవి మెగా మూవీ ఖైదీ నంబర్ 150 విషయంలో.. ఫ్యాన్స్ కు కనీసం ఊపిరి కూడా ఆడనివ్వడంలేదు ఖైదీ యూనిట్. ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ కి అయితే ఓ పండుగ వచ్చి దాని ఎంజాయ్ మెంట్ ఇంకా పూర్తి కాకుండానే.. కొత్త పండగ వచ్చేస్తోంది.

మెగాస్టార్ నటించిన ఖైదీ నంబర్ 150 టీజర్ చేస్తున్న హంగామా ఇంకా కంక్లూజన్ కి రాకముందే.. అంతలోనే అమ్మడు కుమ్ముడు అంటూ ఆడియో సాంగ్ వదిలారు. పాటలో ఉన్న మాస్ రచ్చకు.. మెగాస్టార్ ఫోటోలు చూసి మెగా ఫ్యాన్స్ ఊగిపోతుంటే.. ఇప్పుడా సాంగ్ కి మేకింగ్ వీడియో కూడా ఇచ్చేసింది టీం. మధ్యమధ్యలో చిరు వేసిన స్టెప్స్ కి టీజింగ్.. మెగా డ్యాన్సులకు అక్కడున్న వారి నుంచి రెస్పాన్స్ అద్భుతమైన సెట్స్.. మధ్యలో అందమైన హీరోయిన్ కాజల్.. అదిరిపోయే డ్రస్సుల్లో గ్లామర్.. అన్నిటికీ మించి ఆన్ స్క్రీన్ పై మెగాస్టార్.. ఇక ఫ్యాన్స్ కు పండగ చేసుకునేందుకు ప్రత్యేకమైన కారణం వేరే కావాలా ఏంటి?

అమ్మడితో కుమ్ముడు మెగాస్టార్ ఏ రేంజ్ లో చేశారో తెలియాలంటే ఇంకా మూడు వారాలు ఆగాలి కానీ.. ఈ మెగా హంగామాతో అభిమానుల మనసులను మాత్రం కుమ్మేస్తున్నారు చిరంజీవి. వరుసగా ఇలా అప్డేట్స్ ఇస్తుండడంతో.. ఖైదీ నంబర్ 150పై ఉన్న బజ్ ఆకాశమే హద్దు అన్నంత స్పీడ్ గా పెరిగిపోతోంది.మెగాస్టార్ చిరంజీవి మెగా మూవీ ఖైదీ నంబర్ 150 విషయంలో.. ఫ్యాన్స్ కు కనీసం ఊపిరి కూడా ఆడనివ్వడంలేదు ఖైదీ యూనిట్. ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ కి అయితే ఓ పండుగ వచ్చి దాని ఎంజాయ్ మెంట్ ఇంకా పూర్తి కాకుండానే.. కొత్త పండగ వచ్చేస్తోంది.

మెగాస్టార్ నటించిన ఖైదీ నంబర్ 150 టీజర్ చేస్తున్న హంగామా ఇంకా కంక్లూజన్ కి రాకముందే.. అంతలోనే అమ్మడు కుమ్ముడు అంటూ ఆడియో సాంగ్ వదిలారు. పాటలో ఉన్న మాస్ రచ్చకు.. మెగాస్టార్ ఫోటోలు చూసి మెగా ఫ్యాన్స్ ఊగిపోతుంటే.. ఇప్పుడా సాంగ్ కి మేకింగ్ వీడియో కూడా ఇచ్చేసింది టీం. మధ్యమధ్యలో చిరు వేసిన స్టెప్స్ కి టీజింగ్.. మెగా డ్యాన్సులకు అక్కడున్న వారి నుంచి రెస్పాన్స్ అద్భుతమైన సెట్స్.. మధ్యలో అందమైన హీరోయిన్ కాజల్.. అదిరిపోయే డ్రస్సుల్లో గ్లామర్.. అన్నిటికీ మించి ఆన్ స్క్రీన్ పై మెగాస్టార్.. ఇక ఫ్యాన్స్ కు పండగ చేసుకునేందుకు ప్రత్యేకమైన కారణం వేరే కావాలా ఏంటి?

అమ్మడితో కుమ్ముడు మెగాస్టార్ ఏ రేంజ్ లో చేశారో తెలియాలంటే ఇంకా మూడు వారాలు ఆగాలి కానీ.. ఈ మెగా హంగామాతో అభిమానుల మనసులను మాత్రం కుమ్మేస్తున్నారు చిరంజీవి. వరుసగా ఇలా అప్డేట్స్ ఇస్తుండడంతో.. ఖైదీ నంబర్ 150పై ఉన్న బజ్ ఆకాశమే హద్దు అన్నంత స్పీడ్ గా పెరిగిపోతోంది.