Begin typing your search above and press return to search.

మెగాస్టార్‌ తప్పు చేస్తున్నారుః అమ్మ రాజశేఖర్‌

By:  Tupaki Desk   |   26 Dec 2020 4:00 PM IST
మెగాస్టార్‌ తప్పు చేస్తున్నారుః అమ్మ రాజశేఖర్‌
X
తెలుగు ప్రేక్షకులకు కొరియోగ్రాఫర్‌ గా దర్శకుడిగా సుపరిచితుడు అయిన అమ్మ రాజశేఖర్‌ కొత్త తరం రావడంతో కనిపించకుండా పోతున్నాడు. అలాంటి సమయంలో బిగ్ బాస్ స్క్రీన్‌ పై అమ్మ రాజశేఖర్‌ కనిపించాడు. తనదైన శైలి ఎంటర్‌ టైన్ మెంట్‌ తో అమ్మ రాజశేఖర్‌ ఆకట్టుకున్నారు. కొన్ని కొన్ని వివషయాల్లో ఆయన ప్రవర్తన చాలా మందికి విసుగు తెప్పించింది. అయితే వెళ్లే ముందు మాత్రం అందరిని నవ్వించి వెళ్లాడు. ఇక సీజన్‌ ఫినాలే ఎపిసోడ్‌ లో అమ్మ రాజశేఖర్‌ కనిపించారు. చిరంజీవి ఆయనతో మాట్లాడుతూ మీరు నాతో సినిమా చేయాల్సి ఉంది. అడ్వాన్స్ కూడా ఇచ్చాను. కాని మీరు ఇప్పటి వరకు సినిమా తీయలేదు అన్నాడు. ఇప్పుడు మీరు టైం ఇస్తే తప్పకుండా చేస్తాను అంటూ అమ్మ రాజశేఖర్ అన్నాడు.

తాజాగా అమ్మ రాజశేఖర్‌ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిరంజీవి గారితో గబ్బర్ సింగ్‌ వంటి ఒక మాంచి మాస్ మసాలా సినిమా చేసేందుకు కథ సిద్దంగా ఉందన్నాడు. చిరంజీవి వంటి పెద్ద స్టార్స్ వరుసగా రీమేక్‌ లు చేయడం ఏమాత్రం సరి కాదన్నారు. ఆయన స్థాయికి ఒరిజినల్‌ కథలు చేస్తేనే బాగుంటుందనే అభిప్రాయంను అమ్మ రాజశేఖర్‌ వ్యక్తం చేశారు. వరుసగా రీమేక్‌ లు చేస్తున్న మెగాస్టార్‌ తప్పు చేస్తున్నారేమో అనిపిస్తుంది.

ఆయన కోరితే ఎన్నో కథలు వస్తాయి. కాని ఆయన మాత్రం రీమేక్‌ లపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు అంటూ అమ్మ రాజశేఖర్‌ వ్యాఖ్యలు చేశారు. ఇదే అభిప్రాయంను చాలా మంది అభిమానులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు కూడా కలిగి ఉన్నారు. కాని చిరంజీవి మాత్రం సక్సెస్‌ అయిన కథతో అయితే రిస్క్‌ తక్కువ అని భావిస్తున్నారని తెలుస్తోంది. ముందు ముందు అయిన చిరంజీవి ఒరిజినల్ కథలతో వస్తారని ఆశిద్దాం.