Begin typing your search above and press return to search.

జేడీ కొత్త సినిమా.. టీం భలేగుందే!

By:  Tupaki Desk   |   14 March 2017 4:18 AM GMT
జేడీ కొత్త సినిమా.. టీం భలేగుందే!
X
ఇప్పుడంటే అందరు హీరోలు గెడ్డం లుక్ ను చూపిస్తున్నారు కానీ.. రెండున్నర దశాబ్దాలుగా.. ఈ టైపు లుక్స్ లో రకరకాల వేరియేషన్స్ చూపించాడు జేడీ. జేడీ చక్రవర్తికి యూత్ లో మంచి డిమాండ్ ఉంటుంది. 20 ఏళ్లకు పైగా ఒకటే ఫిజిక్ ని మెయింటెయిన్ చేస్తూ.. కెరీర్ కంటిన్యూ చేస్తున్నాడు గెడ్డం చక్రవర్తి.

ఇప్పుడు జేడీ హీరోగా కొత్త సినిమా ప్రారంభమైంది. కొరియోగ్రాఫర్ నుంచి దర్శకుడిగా మారిన అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కనుండగా.. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయిపోయాయి. ఆదివారం నాడు పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రం.. మార్చ్ 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతం అందిచనున్నట్లు చెప్పాడు దర్శకుడు అమ్మ రాజశేఖర్.

'జేడీ చక్రవర్తి నాకు గురువులాంటి వాడు. తనతో వర్క్ చేయడం.. అది కూడా దర్శకుడిగా పని చేసే అవకాశం రావడం నాకు చాలా సంతోషింగా ఉంది' అని చెప్పాడు అమ్మ రాజశేఖర్. నక్షత్ర మీడియా బ్యానర్ పై నిర్మాణం కానున్న ఈ మూవీకి.. అంజి సినిమాటోగ్రాఫర్ కాగా.. గౌతమ్ రాజు ఎడిటింగ్ కార్యకలాపాలను చూసుకోనున్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/