Begin typing your search above and press return to search.

అమ్మా .. నీ కొడుకుని ఎవరూ ఏమీ చేయలేరు: విష్వక్ సేన్

By:  Tupaki Desk   |   4 May 2022 4:53 AM GMT
అమ్మా .. నీ కొడుకుని ఎవరూ ఏమీ చేయలేరు: విష్వక్ సేన్
X
గత రెండు రోజులుగా ఏ ఛానల్లో చూసినా విష్వక్సేన్ ప్రస్తావనే కనిపిస్తోంది. ఆయన దూకుడుతనాన్ని గురించిన కథనాలు వినిపిస్తున్నాయి. 'అశోకవనంలో అర్జున కల్యాణం' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విష్వక్ సేన్ ఒక ఫ్రాంక్ వీడియో చేయడం .. అది కాస్త వివాదంగా మారడం తెలిసిందే. ఆ గొడవ కాస్తా మరో గొడవకి కారణమైంది. ఇప్పుడు అంతటా ఇదే హాట్ టాపిక్ గా మారిపోయింది. ఆ విషయాన్ని గురించి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ పై విష్వక్ సేన్ ప్రస్తావించాడు.

"ఎన్నో కష్టాలుపడుతూ ఇక్కడివరకూ వచ్చాను. ఇంతకంటే కెరియర్లో ఇంకా ఏముంటాయిలే అనుకున్నాను. కానీ చిన్న చిన్న రప్చర్స్ జరుగుతూనే ఉంటాయి. నాకు తెలిసి ఎదుగుదల అంటే ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు వెళ్లి ఇంట్లో కూర్చోవడం కాదు. ప్రోబ్లం ఎక్కడున్నా దాన్ని తన్ని ఇక్కడికి వచ్చి మీ ముందు నుంచుని స్మైల్ ఫేస్ పెట్టుకుని మాట్లాడటం. ఎప్పుడూ కూడా ఎవరో నన్నేదో అన్నారని .. నా వైపు వ్రేలు చూపించారని భయపడలేదు .. బాధపడలేదు.

నేను బాధపడినదల్లా నాకు కూడా ఫ్యామిలీ ఉంటుంది .. మమ్మీ .. డాడీ .. అక్కా అని ఉంటారు కదా. నేను ఏమైనా చేసుకుంటానేమోనని వాళ్లు ఆలోచన చేయరా? నేను ఒక వ్యక్తికి మాత్రమే ఆన్సర్ చేయాలనుకుంటున్నాను. అమ్మా నీ కొడుక్కి ఏమీ కాదు .. ఎవ్వరూ ఏమీ పీకలేరు .. రాసి పెట్టుకో.

ఇలాంటివి చాలా చూశాను. అమ్మాయిలకు రెస్పెక్ట్ ఇవ్వడని అంటున్నారు. నిన్న నేను ఆ అమ్మాయికి రెస్పెక్ట్ ఇవ్వకపోతే నోరుమూసుకుని వెళ్లిపోయేవాడిని కాదు. అమ్మా .. నీ కొడుక్కి నువ్వు నేర్పించిన సంస్కారం గురించి అందరికీ తెలుసు .. అందరూ చూశారు.

నిజమే నాకు బ్యాక్ గ్రౌండ్ లేదు. ఒక్కడినే ఎక్కడి నుంచో వచ్చాను. ఇంతపెద్ద సినిమా ఇండస్ట్రీలో చిన్న ఈగ లాంటివాడిని. నలుగురు కలిసి ఇట్లా కొడితే పడిపోతానేమో. కానీ ఆ నలుగురు కలిసి నన్ను కొట్టాలంటే నా చుట్టూ పెద్ద స్ట్రాంగ్ సెల్ ఉంది .. అది మీరే. నిన్న నైట్ నా ట్విట్టర్ .. ఇన్ స్టా .. సోషల్ మీడియా ఓపెన్ చేసి చూస్తే .. ఒక్కొక్కడు నాకు సపోర్ట్ చేస్తుంటే, ఇప్పుడు సంపాదించానురా నేను ఆస్తి అనుకున్నాను.

నన్ను ఎవరూ ఏమీ పీకలేని ఆస్తి ఇది. నా దగ్గర నుంచి ఎవరూ లాక్కోలేని ఆస్తి ఇది అనిపించింది. ఏం చూసుకునిరా నీకు ఇంత పొగరు అంటే .. నాకు ఉన్నారు. నాకున్నది ఎవరో డౌట్ ఉంటే హ్యస్టాగ్ విష్వక్ సేన్ అని కొట్టి చూడండి. నా ప్లేస్ లో వీక్ గా ఉండే పర్సన్ ఉంటే ఏమైనా చేసుకునేవాడేమో. కానీ మీరు నాకు ఎంతో ధైర్యం ఇచ్చారు. మీరు బాధపడే పని ఏదీ చేయను. నా మీద మీరు పెట్టుకున్న నమ్మకాన్ని అంతకంతకూ నిలబెడతాను. ఈ ఇయర్లో ఒక మూడు సినిమాలు ఇస్తాను .. రెడీగా ఉండండి .. లవ్ యూ ఆల్" అంటూ ముగించాడు.