Begin typing your search above and press return to search.
అమితాబ్, రేఖ.. వారిదో పూర్తికాని ప్రేమకావ్యం!
By: Tupaki Desk | 29 Nov 2020 11:50 AM GMTఅమితాబ్ బచ్చన్.. రేఖ మధ్య ఏదో ఉందని అప్పట్లో బాలీవుడ్లో వార్తలు వచ్చేవి. అవి పుకార్లు కావని ఇండస్ట్రీలోని వారందరికీ తెలుసు. ఎందుకంటే ఈ విషయంపై రేఖ పలుమార్లు కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. అమితాబ్ మాత్రం ఏనాడు నోరు విప్పలేదు. అతడు మౌనంగా ఉన్నంతమాత్రాన నిజం అబద్ధమైపోలేదు. తనకు తెలియకుండానే అమితాబ్ నిజాన్ని ఎన్నోసార్లు అంగీకరించాడు. అమితాబ్‌తో రేఖ సన్నిహితంగా ఉండటం ఆయన భార్య జయాబచ్చన్‌కు సహజంగానే నచ్చేది కాదు. ఎన్నోసార్లు ఆమె కంటనీరు నింపుకుంది. చివరకు కొందరు సినీపెద్దలు కూడా ఈ విషయంలో జోక్యం చేసుకున్నారు. తాను రేఖతో నటించలేనని అమితాబ్ ప్రొడ్యూసర్లకు తేల్చిచెప్పాడు. దాని వెనక ఉన్న కారణాలు సినీ ఇండస్ట్రీ మొత్తానికి తెలుసు. అయితే అమితాబ్ రేఖతో కలిసి చివరగా నటించిన చిత్రం ‘సిల్‌సిలా’. ఈ సినిమా షూటింగ్‌లోనే రేఖను అమితాబ్ సతీమణి జయా బచ్చన్ భోజనానికి పిలిచారు.
ఈ సందర్భంగా ఆమె రేఖకు సున్నితంగా చురకలు అంటించారట. తాను అమితాబ్‌ను వదులుకొనేందుకు సిద్ధంగా లేనని ఆమె చెప్పారట. ఇక సిల్‌సిలా చిత్రం తర్వాత అమితాబ్.. రేఖల మధ్య స్నేహం.. ప్రేమ రెండూ తగ్గిపోయాయి. కుటుంబసభ్యుల ఒత్తిడితో అమితాబ్ కూడా రేఖతో సినిమాలు చేయలేనని నిర్మాణసంస్థలకు చెప్పేశాడట. ఈ విషయం రేఖ చెవిన పడింది. ఆమె ఈ విషయాన్ని అమితాబ్ వద్ద ప్రస్తావించింది. ‘ దీని గురించి నన్నేమీ అడగొద్డు’ అంటూ అమితాబ్ తప్పించుకున్నాడట. దీంతో వారి మధ్య దూరం మరింత పెరిగింది. అమితాబ్ రేఖతో ఎంతో ప్రేమతో ఇచ్చిన రెండు ఉంగరాలను కూడా ఆమె తిప్పి పంపిదట. అయితే ఈ విషయం గురించి అమితాబ్ కుటుంబం గుంభనంగా ఉండిపోయింది. కొంతకాలం మీడియా కూడా ఈ విషయాన్ని పెద్దగా ఫోకస్ చేయలేదు.
కానీ రేఖ మాత్రం తరుచూ తన ప్రేమ విషయాలను బయటపెడుతూనే ఉంది. ' నేను అమితాబ్‌ను ప్రేమించాను. ఈ ప్రపంచంలో నాకు అమితాబ్ కంటే ఇష్టమైన వాళ్లు ఎవరూ లేరు. అతడు నాకో మార్గదర్శి కూడా. ఆయన నాకు ఎన్నో నేర్పించారు. కానీ ఆయనో పాతతరం మనిషి. అందుకే భార్యను, కుటుంబాన్ని వదులుకోలేదు. ఆయనకు ప్రేమవిలువ, గొప్పతనం తెలియదని నేను అనుకోను. ఆయన తన ప్రేమవ్యవహారాన్ని బయటపెట్టి భార్యను బాధపెట్టలేడు’ అంటూ రేఖ పలు ఇంటర్వ్యూలలో చెప్పారు.