Begin typing your search above and press return to search.

బిగ్ బిని చూసి నేర్చుకో స్మాల్ బి!

By:  Tupaki Desk   |   4 July 2019 7:50 AM GMT
బిగ్ బిని చూసి నేర్చుకో స్మాల్ బి!
X
ప్ర‌యోగాలు చేయాలంటే బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్ త‌ర్వాత‌నే. `నిశ్శ‌బ్ధ్` లో టీనేజీ అమ్మాయిని ప్రేమించే అర‌వై వ‌య‌సు వృద్ధుడిగా న‌టించిన‌ప్పుడు.. `బ్లాక్` చిత్రంలో విచిత్ర వేష‌ధార‌ణ ఆహార్యంతో మైమ‌రిపించిన‌ప్పుడు.. `పా` చిత్రంలో వ‌య‌సు మీరినా బుద్ధి ఎద‌గ‌ని యువ‌కుడిగా న‌టించిన‌ప్పుడు.. ప్ర‌తిసారీ అత‌డిలోని ప్ర‌యోగాత్మ‌క‌త‌కు అభిమానులు ప్ర‌శంస‌లు కురిపించారు. కెరీర్ ఆరంభం నుంచి అమితాబ్ ప్ర‌యోగాల‌ బాట‌లోనే వెళ్లారు. జంజీర్- అగ్నిప‌థ్ లాంటి క్లాసిక్స్ ఆయ‌న కెరీర్ ని కీల‌క మ‌లుపు తిప్పాయి. బ్లాక్ - పికు లాంటి చిత్రాల‌తో లేటు వ‌య‌సులోనూ త‌న‌కంటూ ఒక దారి సెట్ చేసుకుని అందులో విజ‌య‌వంతంగా కెరీర్ ని సాగిస్తున్నారు.

ప్ర‌యోగాలు చేస్తూనే హిట్టు- సెన్సేష‌న‌ల్ హిట్లు ఆయ‌న సొంతం చేసుకున్నారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా అసాధార‌ణ ఫాలోయింగ్ పెంచుకున్నారు. ప్ర‌స్తుతం సుర్జీత్ సిర్కార్ ద‌ర్శ‌క‌త్వంలోని `గులాబో సితాబో` మ‌రో ప్ర‌యోగం అనే చెప్పాలి. ఇప్ప‌టికే అమితాబ్ గెట‌ప్ రివీలై ఫ్యాన్స్ లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు తావిచ్చింది. నెవ్వ‌ర్ బిఫోర్ గెట‌ప్ తో బిగ్ బి ఇచ్చిన స‌ర్ ప్రైజ్ మామూలుగా లేదంటూ కితాబందుకున్నారు. ఈ చిత్రంలో ఒక ముస్లిమ్ పాత్ర‌లో అమితాబ్ న‌టిస్తున్నారు. ఆ పాత్ర లుక్ ఆస‌క్తిక‌రం. పాత క‌ళ్ల‌ద్దం.. గుబురుగా నెరిసిన గడ్డం.. సూదంటు ముక్కు.. తీక్ష‌ణ‌మైన చూపు.. త‌ల‌పై నుంచి గ‌ళ్ల ట‌వ‌ల్.. లాల్చీ.. ప్ర‌తిదీ అభిమానుల్లో చ‌ర్చ‌కు వ‌చ్చాయి. పికు- పా- బ్లాక్ చిత్రాల్లో న‌ట‌న‌కు ఉత్త‌మ న‌టుడిగా జాతీయ అవార్డులు అందుకున్నారు. మ‌రోసారి అలాంటి ప్ర‌య‌త్న‌మే చేస్తున్నార‌ని అంచ‌నా వేస్తున్నారంతా.

తాజాగా `గులాబో సితాబో` గెట‌ప్ కి సంబంధించిన‌ మ‌రిన్ని కొత్త ఫోటోల్ని వైర‌ల్ భ‌యానీ రివీల్ చేశారు. ఈ ఫోటోల్లో అమితాబ్ రూపం హాట్ టాపిక్ గా మారింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు అభిమానుల్లోకి వైర‌ల్ గా దూసుకెళ్తున్నాయి. తాజా ప్ర‌యోగాత్మ‌క చిత్రంలో అమితాబ్ పెర్ఫామెన్స్ ఛాలెంజింగ్ గా ఉండ‌బోతోంద‌ని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మేక‌ప్ అమేజింగ్.. బిగ్ బి ఆ గెట‌ప్పులో అద్భుతంగా న‌టించారంటూ లీకులు అందుతున్నాయి. ఇక అమితాబ్ ని చూసి నేర్చుకోవాలంటూ ఈ ఫోటోల్ని చూపించి కొంద‌రు అభిమానులు అభిషేక్ బ‌చ్చ‌న్ ని సామాజిక మాధ్య‌మాల వేదిక‌గా టార్గెట్ చేయ‌డం చ‌ర్చ‌కొచ్చింది.