Begin typing your search above and press return to search.

అమితాబ్‌ ఐసోలేషన్‌ అనుభవాలు

By:  Tupaki Desk   |   26 July 2020 4:30 PM GMT
అమితాబ్‌ ఐసోలేషన్‌ అనుభవాలు
X
బాలీవుడ్‌ బిగ్‌ బి అమితాబచ్చన్‌ కరోనా కారణంగా ముంబయిలోని నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెల్సిందే. ఆయన కుటుంబ సభ్యులు అయిన అభిషేక్‌ బచ్చన్‌.. ఐశ్వర్య రాయ్‌.. ఆరాధ్యలు కూడా కరోనా కారణంగా చికిత్స పొందుతూ అదే ఆసుపత్రిలో ఉన్నారు. అయినా కూడా ఎవరికి వారే అన్నట్లుగా ఏ ఒక్కరు మరొకరికి కనిపించకుండా ఉన్నారట. కరోనా మనిషిని మానసికంగా దెబ్బ తీస్తుంది అంటూ అమితాబ్‌ ఆవేదన వ్యక్తం చేశాడు.

ఐసోలేషన్‌ వార్డులో ఒంటరిగా ఉన్న తన వద్దకు ఎవరు రారు. మరెవ్వరు కనిపించరు. వైధ్యులు నర్స్‌ వచ్చినా కూడా వారు పీపీఈ కిట్స్‌ ధరించి ఉన్నారు. కనీసం వారి మొహ కవలికలు కూడా గుర్తించలేనంతగా వారు కిట్‌ ధరించి ఉన్నారు. ఇక వారు ఉండే కొన్ని నిమిషాలు కూడా హర్రీ బర్రీగా ఉంటారు. హడావుడిగా అక్కడి నుండి వెళ్లి పోవాలనుకుంటున్నారు. ఎక్కువ సమయం ఉంటే తమకు వైరస్‌ అంటుకుంటుందేమో అని వారి భయం. దూరంగా ఉండి మాట్లాడటం వీడియో కాల్‌ లో వైధ్యులు సలహాలు ఇవ్వడం వంటివి చేస్తున్నారు.

ప్రస్తుత సమయంలో ఇదే నయం. కాని ఇలా ఉండటం వల్ల మానసికగా వ్యక్తి దెబ్బ తినే అవకాశం ఉందని బిగ్‌ బి అన్నారు. రాత్రి రూంలో ఒంటరిగా చలికి వణికి పోతూ ఉన్నాను. నిద్ర పోయేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నాను. కళ్లు మూసుకుని పాటలు పాడుకుంటూ పడుకునేందుకు ప్రయత్నిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. అమితాబ్‌ కు తాజాగా పరీక్ష చేయగా మరోసారి నెగటివ్‌ రావడంతో ఆయన్ను ఐసోలేషన్‌ వార్డులోనే కొనసాగించాలని వైధ్యులు నిర్ణయించుకున్నారు.