Begin typing your search above and press return to search.
బిగ్ బి ట్విట్టర్ హ్యాక్.. పాక్ ప్రధాని ప్రత్యక్షం
By: Tupaki Desk | 11 Jun 2019 10:54 AM ISTబిగ్ బి అమితాబ్ కి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే. ట్విట్టర్ - ఇన్ స్టా వంటి వేదికలపై ఆయన చేసే ప్రతి పోస్ట్ ని కోట్లాది మంది అభిమానులు ఎంతో ఆసక్తిగా ఫాలో అవుతుంటారు. అయితే అలాంటి వేదిక ఉన్నట్టుండి ఉలిక్కిపాటుకు కారణమైంది.
నిన్నటి సాయంత్రం బిగ్ బి ట్విట్టర్ ప్రొఫైల్ అనూహ్యంగా మారిపోయింది. ఆయన ప్రొఫైల్ ఫోటో స్థానంలో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రత్యక్షమయ్యారు. అంతేకాదు అమితాబ్ ప్రొఫైల్ డీటెయిల్స్ మారిపోయాయి. `లవ్ పాకిస్తాన్` అంటూ ఓ వ్యాఖ్య ప్రత్యక్షమైంది. దీంతో ఖంగు తినడం అభిమానుల వంతయ్యింది. బిగ్ బి తన ప్రొఫైల్ ని ఇలా మార్చేశారేంటి? అని తొలుత కంగారు పడినవాళ్లకు అసలు సంగతి ఆ తర్వాత తెలిసింది. ఇది హ్యాకర్ల పని. ఫోటోని మార్చి పాకిస్తాన్ కి మద్ధతుగా కొటేషన్ ని ఇవ్వడంతో ఇది పాక్ ప్రేరేపిత హ్యాకర్ల పని అని అందరికీ అర్థమైంది. ప్రస్తుతం దీనివెనుక పాకిస్తాన్ మద్దతుదారులైన హ్యాకర్స్ హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తాజాగా ఈ దుశ్చర్యకు పాల్పడిన హ్యాకర్లు ఎవరు? అన్నది సైబర్ క్రైమ్ పోలీస్ ఆరాతీస్తే ఇందులో టర్కీ మూలాలు బయటపడడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. టర్కీకి చెందిన హ్యాకర్ల గ్రూప్ `అయ్యిల్ దిజ్ టిమ్` ఈ పనికి పాల్పడింది. ఉద్ధేశపూర్వకమైన హ్యాకింగ్ ఇది! అంటూ అనుమానాల్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక అమితాబ్ బచ్చన్ క్రికెట్ ప్రియుడు అన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వరల్డ్ కప్ నేపథ్యంలో అతడు ఇండియా టీమ్ కి మద్ధతుగా ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారోనన్న ఆసక్తి అభిమానుల్లో ఉంది. ఈనెల 13న న్యూజిల్యాండ్ తో.. అటుపై 16న పాకిస్తాన్ తో కీలకమైన మ్యాచ్ లు టీమిండియా ఆడనుంది. మరోవైపు బిగ్ బి నిన్నంతా ఔటాఫ్ మూడ్ లో ఉన్నారు. సోమవారం నాడు అమితాబ్ సెక్రటరీ శీతల్ జైన్ కన్నుమూశారు. అమితాబ్ కుటుంబ వ్యవహారాల్లో శీతల్ కీలకంగా వ్యవహరించేవారు. అమితాబ్ సినీ కెరియర్ ప్రారంభమైనప్పటి నుంచి శీతల్ సెక్రటరీ. ఇలాంటి టైమ్ లో హ్యాకర్లు ట్విట్టర్ ని హ్యాక్ చేశారు.