Begin typing your search above and press return to search.
ఆమె పాదాలకు నమస్కారం చేసిన మెగాస్టార్!
By: Tupaki Desk | 23 Aug 2019 2:13 PMబాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్ ఎప్పటికప్పుడు తన మంచి మనసును ప్రదర్శిస్తూనే ఉంటాడు. దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న మెగాస్టార్ ను కనీసం దూరం నుంచైనా ఒక్కసారి చూడాలని కోరుకునే వారు కోట్ల మంది ఉంటారు. అలాంటి అమితాబచ్చన్ ఒక మహిళ కాళ్లకు నమస్కారం చేశాడు. అమితాబ్ తోనే కాళ్లకు నమస్కారం చేయించుకుందంటే ఆమె మరెంత గొప్ప వ్యక్తి అయ్యింటుందో అర్థం చేసుకోవచ్చు.
అమితాబచ్చన్ హోస్టింగ్ చేస్తున్న కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమంలో సామాజికవేత్త సింధూతాయ్ సప్కల్ పాల్గొన్నారు. దాదాపు వెయ్యి మంది అనాధ పిల్లలను తన సొంత పిల్లలుగా పెంచుతూ ఉన్న సింధూతాయ్ గురించి తెలుసుకున్న అమితాబ్.. ఆమె మాటలకు ఆశ్చర్యపోయి ఆమె పాదాలకు నమస్కారం చేశాడు. ఆమె చేస్తున్న పనిని అభినందించాడు.
నేడు ఈ ఎపిసోడ్ సోనీ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ లో ప్రసారం కాబోతుంది. ఫేస్ బుక్ లో సోనీ ఎంటర్ టైన్ మెంట్స్ టెలివిజన్ ఛానెల్ లో ఈ వీడియోను పోస్ట్ చేయడం జరిగింది. సింధూతాయ్ గొప్పతనం.. ఆమె అనాధ పిల్లలకు చేసిన సేవ గురించి రాత్రి ప్రసారం కాబోతున్న ఎపిసోడ్ లో పూర్తిగా వివరించనున్నారు. అమితాబచ్చన్ కౌన్ బనేగా కరోడ్ పతి షో కు ఎంతో మంది ప్రముఖులు.. గొప్ప వారు హాజరు అయ్యారు. కాని ఏ ఒక్కరికి కూడా అమితాబ్ ఈ స్థాయిలో వారికి నమస్కారం చేసింది లేదు. ఆమె స్ఫూర్తికి అమితాబ్ గౌరవించారు.